రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్.. మాట ఇవ్వాలంటూ ట్వీట్?

నేడు రాఖీ పౌర్ణమి కావడంతో పెద్ద ఎత్తున సెలెబ్రెటీలు, అక్క చెల్లెమ్మలు తమ సోదరీ సోదరులకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎంతోమంది తమ అన్నదమ్ములకు రాఖీలు కట్టి వారు క్షేమంగా ఉండాలని తమకు అండగా ఉండాలని కోరుకుంటున్నారు.ఇకపోతే నేడు రాఖీ పౌర్ణమి కావడంతో అక్క చెల్లెమ్మలందరికీ మెగాస్టార్ చిరంజీవి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఈయన ట్విట్టర్ వేదికగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఒక ట్విట్ చేశారు.

ఈ సందర్భంగా చిరంజీవి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. రాఖీ కట్టించుకోవడమే కాదు రక్షణగా నిలుస్తామని అన్నదమ్ములు అక్క చెల్లెమ్మలకు మాట ఇవ్వాలి అంటూ అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం మెగాస్టార్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే ఈయన నటిస్తున్న భోళా శంకర్ సినిమా నుంచి రాఖీ పౌర్ణమి సందర్భంగా ఒక స్పెషల్ వీడియో షేర్ చేశారు ఇక ఇందులో చెల్లెలు సెంటిమెంట్ ఉన్న విషయం మనకు తెలిసిందే.

ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి చెల్లెలుగా నటి కీర్తి సురేష్ నటిస్తున్నారు.ఇకపోతే రాఖీ పౌర్ణమి సందర్భంగా ఈ సినిమా నుంచి ఒక పోస్టర్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో కీర్తి సురేష్ చిరంజీవికి రాఖి కడుతున్నట్టు ఉన్న పోస్టర్ విడుదల చేశారు.ఇకపోతే చిరంజీవి సినిమాల విషయానికి వస్తే ఈయన ఆచార్య సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఈ సినిమా పెద్దగా విజయాన్ని అందుకోలేదు అదేవిధంగా ప్రస్తుతం చిరంజీవి గాడ్ ఫాదర్, భోళా శంకర్, వాల్తేరు వీరయ్య అనే సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.