మహేష్ – త్రివిక్రమ్ కి మాసివ్ ఓటిటి డీల్.!

టాలీవుడ్ ఆల్ టైం ఎవర్ గ్రీన్ చార్మింగ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్ లో మొదటిసారిగా ఓ దర్శకుడుతో చేస్తున్న హ్యాట్రిక్ సినిమా ఏదన్నా ఉంది అంటే అది తన కెరీర్ లో చేస్తున్న 28వ సినిమా అని చెప్పాలి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో హిట్ మరియు ప్లాప్ లతో సంబంధం లేకుండా మహేష్ చేస్తున్న మొదటి సినిమా ఇది.

దీనితో ఈ సినిమాపై అనేక అంచనాలు నెలకొనగా ఈ ఈ చిత్రం మహేష్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమా ఇప్పుడు ఇంకా షూటింగ్ దశ లోనే ఉండగా ఈ సినిమా పై అయితే ఇప్పుడు ఓ క్రేజీ న్యూస్ సినీ వర్గాల్లో వైరల్ గా మారింది.

మరి ఈ సినిమాకి అయితే దిగ్గజ ఓటిటి ప్లాట్ ఫామ్ అయినటువంటి నెట్ ఫ్లిక్స్ వాళ్ళు ఈ సినిమాకి మాసివ్ ఆఫర్ ఇచ్చి సొంతం చేసుకున్నారట. మరి ఈ సినిమాకి నెట్ ఫ్లిక్స్ వారు ఏకంగా 80 కోట్ల డీల్ ని ఇచ్చి ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు సొంతం చేసుకున్నారట.

దీనితో ఈ భారీ సినిమా ఇంకా షూటింగ్ దశ లోనే ఉండగా రికార్డు డీల్ అందుకుంది చెప్పాలి. అయితే ఈ డీల్ కోసం సినీ వర్గాల్లో ఓ రేంజ్ లో చర్చ నడుస్తుంది. మరి ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీ లీల కూడా నటిస్తుంది. అలాగే థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని హారికా హాసిని ఎంటర్టైన్మెంట్స్ వారు 200 కోట్ల బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.