Venkatesh – Trivikram: వెంకటేశ్ – త్రివిక్రమ్ ప్రాజెక్ట్.. లాంచ్ ఎప్పుడంటే?

విక్టరీ వెంకటేశ్‌ “సంక్రాంతికి వస్తున్నాం” సినిమాతో మాస్ మార్కెట్‌లో కూడా 300 కోట్ల క్లబ్‌లో చేరడంతో, ఆయన కొత్త సినిమాపై భారీ ఉత్కంఠ నెలకొంది. అదే సమయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా మళ్లీ తన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ట్రాక్‌కి రావాలని చూస్తుండగా, ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఓ ఫుల్ ఫ్యామిలీ డ్రామా రాబోతుందని టాలీవుడ్ వర్గాల్లో బలమైన బజ్ వినిపిస్తోంది. జూన్ 6న ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని టాక్.

లేటెస్ట్ టాక్ ప్రకారం ఈ సినిమా స్క్రిప్ట్ ఇప్పటికే త్రివిక్రమ్ స్టయిల్‌లో సిద్ధమైపోయిందట. కామెడీ ఎమోషన్స్ తో మిక్స్ చేసిన ఈ కథలో వెంకటేశ్ పాత్ర ఓ ఫుల్ ఫ్లెడ్జ్ ఫ్యామిలీ మెన్‌గా ఉంటుందట. ఇక హీరోయిన్‌ విషయానికి వస్తే, “సప్త సాగరాలు” సినిమాతో పేరు తెచ్చుకున్న రుక్మిణి వసంతను తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్నారట. వెంకటేశ్ సరసన ఆమెకు జోడీగా అవకాశం రావడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.

త్రివిక్రమ్ – అల్లు అర్జున్ సినిమా ఆలస్యంగా మొదలయ్యే అవకాశం ఉండటంతో మధ్యలో ఉన్న టైమ్‌ను వెంకటేశ్ చిత్రానికి వినియోగించాలని దర్శకుడు భావిస్తున్నట్టు సమాచారం. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ జూన్‌లో లాంఛనంగా ప్రారంభమైతే, ఏడాది చివర్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. అభిమానులు మాత్రం వెంకీ – త్రివిక్రమ్ కాంబినేషన్‌పై ‘మినిమం గ్యారంటీ’ అనుకుంటూ భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పుడు జూన్ 6న అధికారిక ప్రకటన వెలువడుతుందా లేదా అన్నది సినీ జనాల ముంగిట ప్రశ్నగా మారింది.

టాలీవుడ్ కు పవన్ వార్నింగ్ || Producer Natti Kumar Reacts On pawan Kalyan Warning To Tollywood || TR