పాన్ ఇండియా సినిమా దగ్గర రానున్న సీక్వెల్ లలో సెన్సేషన్ సినిమా పుష్ప 2 ఒకటి కాగా బాహుబలి 2 మరియు కేజీఎఫ్ 2 తర్వాత అయితే పుష్ప 2 పై మళ్ళీ అంత హైప్ నెలకొంది. ఇక ఈ సీక్వెల్ నుంచి క్రేజీ గిఫ్ట్ ని వరల్డ్ అవైటెడ్ సీక్వెల్ అయినటువంటి “అవతార్ 2” తో అయితే అందిస్తున్నట్టుగా గత కొన్ని వారాల కితం కొన్ని గాసిప్స్ సోషల్ మీడియా సహా సినీ వర్గాల్లో కూడా ఊపందుకున్నాయి.
మరి ఇదిలా ఉండగా కొన్ని ట్రస్టడ్ సినీ వర్గాలు కూడా ఈ న్యూస్ ని కన్ఫర్మ్ చేసాయి. ఇక మరో రెండు రోజుల్లో అవతార్ 2 అయితే రిలీజ్ కాబోతుంది. దీనితో ఈ చిత్రంతో పుష్ప 2 వీడియో కలిపి వస్తుందా లేదా అనే అనుమానాలు అయితే ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి.
మరి ప్రస్తుతం ఉన్న ప్రోగ్రెస్ తో అయితే ఇలాంటివి ఏవి లేవని తెలుస్తుంది. మరి దీనితో అవతార్ 2 తో పుష్ప 2 వీడియో లేనట్టే అని తెలుస్తుంది. కాకపోతే దీనిపై ఇంకా సరైన అప్డేట్ ఇంకా రావాల్సి ఉంది. ఒకవేళ రిలీజ్ అయితే ఇది ఇండియా వెర్షన్ వరకే ఉండనుంది అలాగే అన్ని భాషల్లో కలిపి ఉంటుందట.
ఇక ఈ భారీ చిత్రాన్ని సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా అవతార్ 2 ని జేమ్స్ కామెరాన్ తెరకెక్కించారు. అలాగే ఈ డిసెంబర్ 16న అవతార్ 2 ఏకంగా 160 భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది.
