KTR: అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేసి ఆయనను పోలీస్ స్టేషన్ కి తరలించడం పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు నిరసనలు వెల్లవెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం అల్లు అర్జున్ అరెస్టుపై స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్ ప్రస్తుతం సంచలనగా మారింది. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ వేదికగా తెలంగాణ పోలీస్ తీరుపై మండిపడ్డారు.
పుష్ప 2 ప్రీమియర్ షో చూడటం కోసం అల్లు అర్జున్ తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్లోని సంధ్యా థియేటర్ వద్దకు వెళ్లారు అయితే అల్లు అర్జున్ రావడంతో ఒక్కసారిగా అభిమానులు తరలి రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో భాగంగా రేవతి అనే మహిళ అభిమాని మరణించారు. ఇక ఈ విషయం గురించి కేటీఆర్ ప్రస్తావిస్తూ..జాతీయ అవార్డు పొందిన అల్లు అర్జున్ అరెస్టు సరైంది కాదని అన్నారు. తొక్కిసలాటకు అల్లు అర్జున్ ప్రత్యక్షంగా కారణం కాదు. ఆయన పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు బాగోలేదని కేటీఆర్ పేర్కొన్నారు. అల్లు అర్జున్ సాధారణ నేరస్థుడిలా చూడడం సరికాదు. పాలకుల అభద్రతా భావానికి అల్లు అర్జున్ అరెస్టు తీరు నిదర్శనమని కేటీఆర్ విమర్శించారు.
ఈ తొక్కిసిలాటకు అల్లు అర్జున్ కారణం కాదని ఆయన అరెస్టును నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అంటూ ఈ సందర్భంగా కేటీఆర్ పేర్కొన్నారు. ఇలా ఒక సాధారణ వ్యక్తిని అరెస్టు చేసినట్టు నేషనల్ అవార్డు విన్నర్ ను అరెస్టు చేయడంతో పూర్తి స్థాయిలో అల్లు అర్జున్ అరెస్టు పట్ల వ్యతిరేకత వస్తుంది. మరి అల్లు అర్జున్ అరెస్టు చేసిన పోలీసులు ఆయనను కోర్టుకు హాజరు పరుస్తారా ఆయనపై ఎలాంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఆయనకు బెయిల్ వస్తుందా అనేది తెలియాల్సి ఉంది.