Allu Arjun: సినీ నటుడు అల్లు అర్జున్ కు భారీ ఉపశమనం లభించింది. నేడు ఈయన బెయిల్ పిటిషన్ వాయిదా విచారణ జరిగింది అయితే ఈ విచారణ అనంతరం నాంపల్లి కోర్టు తనకు రెగ్యులర్ బెయిల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అల్లు అర్జున్ కు ఉపశమనం లభించినట్టు అయింది. ఇలా రెగ్యులర్ బెయిల్ తో పాటు 50వేల రూపాయలు చొప్పున రెండు పూచీ కత్తులపై ఈయనకు బెయిల్ మంజూరు చేశారు.
ఇక కోర్టు వెల్లడించిన తీర్పుతో అల్లు అర్జున్ కు పెద్ద ఉపశమనం లభించింది అని చెప్పాలి. నేడు బెయిల్ పిటిషన్ విచారణ జరిగిన నేపథ్యంలో ఈయనకు బెయిల్ వస్తుందా లేదా జైలుకు వెళ్లాలా అనే విషయంపై అభిమానులలో కూడా పెద్ద ఎత్తున టెన్షన్ నెలకొంది కానీ అల్లు అర్జున్ కు రెగ్యులర్ బెయిల్ రావడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో భాగంగా రేవతి అనే అభిమాని మరణించడంతో ఈయనపై కేసు నమోదు కావడం పోలీసులు తనని అరెస్టు చేసి ఒకరోజు మొత్తం జైల్లో పెట్టడం జరిగింది.
ఇలా చంచల్ గూడా జైలుకు అల్లు అర్జున్ వెళ్లారు ఒకరోజు తర్వాత తనకు మధ్యంతర బెయిల్ రావడంతో ఈయన విడుదల అయ్యారు. అయితే ఈ బెయిల్ గడువు పూర్తి కావడంతో ఈయన మరోసారి పిటిషన్ దాఖలు చేశారు. ఇక నేడు అల్లు అర్జున్ బెయిల్ పిటీషన్ విచారణకు రాగా ఈయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. దీంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పుష్ప 2 సినిమా విడుదల సమయంలో సంధ్య థియేటర్ వద్ద ఈ తొక్కిసలాట జరిగింది అల్లు అర్జున్ అక్కడికి వెళ్లడంతో ఆయనని చూడడం కోసం అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఆ సమయంలోనే తొక్కిసలాట జరిగి అభిమాని మరణించడంతో ఈయన పై కేసు నమోదు అయింది. అయితే ఈ కేసులో అల్లు అర్జున్ ఏకంగా A11 ముద్దాయిగా ఉన్నప్పటికీ తనని అరెస్టు చేయడంతో ఈ అరెస్టు వెనుక ఏదో కుట్ర దాగి ఉందని అనుమానాలు వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ అరెస్టు కాస్త ఇటు సినీ ఇండస్ట్రీలోనూ అటు తెలంగాణ రాజకీయాలలో కూడా చర్చలకు కారణమైంది.