మీలాంటి వారిని ఇలాంటి షోలకు పిలవడం తప్పు.. యంగ్ హీరోలను ఓ ఆట ఆడుకున్న బాలయ్య?

బాలకృష్ణ వ్యాఖ్యాతగా అన్ స్టాపబుల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం మనకు తెలిసిందే.ఆహాలో ప్రసారమవుతున్నటువంటి ఈ కార్యక్రమం మొదటి సీజన్ ఎంతో మంచి ఆదరణ అందుకోవడంతో రెండవ సీజన్ కూడా ప్రారంభించారు. ప్రస్తుతం రెండవ సీజన్ కూడా అదే ఉత్సాహంతో కొనసాగుతోంది. ఇప్పటికే రెండవ సీజన్లో మూడు ఎపిసోడ్లు పూర్తి అయ్యాయి. మూడవ ఎపిసోడ్లో భాగంగా యంగ్ హీరోలు శర్వానంద్ అడవి శేషు హాజరయ్యారు. ఈ యంగ్ హీరోలతో కలిసి బాలయ్య ఎంతో సరదాగా ముచ్చటించారు.

ఈ విధంగా యంగ్ హీరోలతో కలిసి వారి కెరియర్లో ఎదుర్కొన్నటువంటి చేదు అనుభవాలను అలాగే మెమొరబుల్ సంఘటనలను గురించి ప్రస్తావించారు. ఇకపోతే బాలయ్య గురించి శర్వానంద్ ఓ రహస్యాన్ని తెలియజేశారు.ఓ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ ఒక అమ్మాయితో కలిసి 5:30 నిమిషాల పాటు కంటిన్యూస్ గా డాన్స్ చేశారు. ఆ అమ్మాయి అయితే మూడున్నర నిమిషాలకే పడిపోగా ఈయన మాత్రం ఐదు నెలల నిముషాలు డాన్స్ చేస్తే కమాన్ నెక్స్ట్ సాంగ్ ఎవరు రెడీ అంటూ పిలిచారని అంత ఎనర్జీ లెవెల్స్ బాలకృష్ణ గారి లో ఉన్నాయంటూ తెలిపారు.

శర్వానంద్ మాటలకు స్పందించిన బాలయ్య నువ్వు చెప్పేదంతా నిజమే కానీ దయచేసి అమ్మాయి పేరు బయట పెట్టకు అంటూ రెండు చేతులు జోడించి నమస్కరించారు.అదేవిధంగా శర్వానంద్ మీ నాన్నగారి దగ్గర మా తాతయ్య అకౌంటెంట్ మీకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఆస్తి విషయాలకు సంబంధించిన కాపీలన్నీ మా దగ్గర ఉన్నాయి. మీ ఆస్తుల లిస్ట్ బయట పెట్టమంటారా సార్ అని అడిగారు. ఎన్ని బిట్లు ఉన్నాయో చెప్పమంటారా అంటూ శర్వానంద్ అడగగా బాలయ్య ఆ బిట్లు కాదమ్మా డౌన్లోడ్ బిట్లు అంటూ నవ్వులు పూయించారు. అనంతరం నాది ఫ్యామిలీ షో నా షో కు మీలాంటి వారిని పిలవడం తప్పు అంటూ సరదాగా ఈ యంగ్ హీరోలతో బాలయ్య బాబు ఓ ఆట ఆడుకున్నారు.