Balakrishna: బాలకృష్ణను బాలయ్య అని పిలవడం వెనుక ఇంత స్టోరీ ఉందా?

Balakrishna: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న వారిలో నందమూరి బాలకృష్ణ ఒకరు. సీనియర్ నటుడు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బాలకృష్ణ తన తండ్రి వారసత్వాన్ని ఇటు సినిమా ఇండస్ట్రీలోనూ అటు రాజకీయాలలో కూడా కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న బాలకృష్ణ ఎమ్మెల్యేగా హిందూపురం నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు విజయం సాధించి రాజకీయాలలో కూడా తానేంటో నిరూపించుకున్నారు.

ప్రస్తుతం ఒకవైపు రాజకీయాలు మరోవైపు సినిమాలు అంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న బాలకృష్ణకు సంబంధించి ఒక వార్త వైరల్ అవుతుంది. సాధారణంగా బాలకృష్ణను అభిమానులు ఎన్నో రకాల పేర్లతో పిలుచుకుంటూ ఉంటారు. అందులో ఎక్కువ మంది బాలయ్య అంటూ తనని ముద్దుగా పిలుస్తుంటారు. ఇక ఇటీవల కాలంలో సినిమాలలో కూడా జై బాలయ్య అనే సాంగ్ ట్రెండ్ అవ్వడమే కాకుండా బయట ఎక్కడ చూసినా కూడా అభిమానులు ఇదే నినాదం చేస్తూ ఉంటారు.

ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరూ కూడా బాలకృష్ణను జై బాలయ్య అంటూ పిలవడంతో ఎందుకు బాలకృష్ణకు ఆ పేరు వచ్చింది అంటూ కొంతమంది అభిమానులు సందేహాలను వ్యక్తం చేస్తూ ఉంటారు. బాలకృష్ణను బాలయ్య అని పిలవడం వెనుక ఒక పెద్ద స్టోరీ ఉందని చెప్పాలి. అప్పట్లో బాలకృష్ణ డైరెక్టర్ బి.గోపాల్ కాంబినేషన్ అంటే సూపర్ హిట్ కాంబినేషన్ అని చెప్పాలి. వీరిద్దరి కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నరసింహనాయుడు, సమరసింహారెడ్డి, లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్ వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి.

లారీడ్రైవర్ సినిమా టైంలో జొన్నవిత్తుల పాట రాస్తున్నప్పుడు డైరెక్టర్ బి. గోపాల్ మీరు పాట ఏమైనా రాసుకోండి.. పాటలో మాత్రం బాలయ్య అనే పదం వినిపించాలంటూ డైరెక్టర్ గోపాల్ చెప్పడంతో వెంటనే జొన్నవిత్తుల బాలయ్య బాలయ్యా.. గుండెల్లో గోలయ్యా జో కొట్టాలయ్యా అని రాశారు దీంతో బాలయ్య అనే పదం ఫేమస్ అవ్వడమే కాకుండా అదే తన ముద్దు పేరుగా మారిపోయి అభిమానులు కూడా ఎంతో అమితంగా ఇష్టపడుతున్నారని చెప్పాలి.