ఆ విషయంలో అందరి హీరోయిన్లని వెనక్కి నెట్టి మొదటి స్థానం సంపాదించుకున్న ప్రియాంక చోప్రా..?

ప్రస్తుత కాలంలో టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది. ఈ క్రమంలో సెలబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటున్నారు. దీంతో సెలబ్రిటీలకి అభిమానులకి మధ్య మంచి ప్లాట్ ఫామ్ ఏర్పడింది. సెలబ్రిటీలు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వారి జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో వారి సినిమా విశేషాలు మాత్రమే కాకుండా పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటారు. కొన్ని సందర్భాలలో అభిమానులతో చిట్ చాట్ చేస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సెలబ్రిటీలు అధిక సంఖ్యలో ఫాలోవర్స్ ని సొంతం చేసుకుంటున్నారు.

బాలీవుడ్ హీరోయిన్లు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అధిక సంఖ్యలో ఫాలోవర్స్ ని పెంచుకుంటున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ప్రియాంక చోప్రా అందరి హీరోయిన్లను వెనక్కి నెట్టి అత్యధికంగా 80.9 మిలియన్ ఫాలోవర్స్‌ ని సంపాదించుకొని మొదటి స్థానంలో నిలిచింది. ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్ సినిమాలతో పాటు హాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్ లతో ఫుల్ బిజీగా ఉంది. ఇక ప్రియాంక తన భర్త నిక్ జోనస్ తో రొమాంటిక్ ఫోటోలు తరచు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఈమె ధరించే దుస్తులు వల్ల కొన్ని సందర్భాలలో విమర్శలు కూడా ఎదుర్కొంటోంది.

ఇక మరొక బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ కపూర్ కి కూడా అధిక సంఖ్యలో ఫాలోయర్స్ ఉన్నారు. శ్రద్ధ కపూర్‌కు ఇన్‌స్ట్రాగ్రామ్‌లో 73.8 మిలియన్ ఫాలోవర్స్‌ తో రెండో స్థానంలో నిలిచింది. ఇక బాలీవుడ్ లో హీరోయిన్లతో పోటీ పడుతూ స్టార్ సింగర్ నేహా కక్కర్ ఇన్‌స్టాగ్రామ్‌లో 70.4 మిలియన్ ఫాలోవర్స్‌తో మూడో స్థానంలో నిలిచింది. ఇక ఆలియా భట్ 68.4 మిలియన్ ఫాలోవర్స్‌తో 5వ స్థానం నుంచి 4వ స్థానంలోకి రాగా 68.2మిలియన్ ఫాలోవర్స్‌ తో దీపికా 5 వ స్థానంలో నిలిచింది. ఇక కత్రినా కైఫ్ 66.1మిలియన్ ఫాలోవర్స్‌తో ఐదో స్థానం నుంచి 6వ స్థానంలోకి పడిపోగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ 62.6 మిలియన్ ఫాలోవర్స్‌తో 7 వ స్థానంలో నిలిచింది. ఇక అనుష్క శర్మ పెళ్ళి తర్వాత సినిమాలు తగ్గించి 59.4 మిలియన్ ఫాలోవర్స్‌తో ఎనిమిదో స్థానంలో ఉండగా 53.8 ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్‌తో ఊర్వశి రౌతెలా 9 వ స్థానంలో ఉండగా, 53.3మిలియన్ వ్యూస్‌తో సన్నీ లియోన్ తొమ్మిదో స్థానం నుంచి 10వ ప్లేస్‌లోకి వచ్చింది.