ఫ్లాష్ న్యూస్ : బాలయ్య షోలో ప్రభాస్ తో ఈ స్టార్ హీరో కూడా..!

లేటెస్ట్ గా టాలీవుడ్ సినీ వర్గాల్లో మంచి వైరల్ అవుతున్న ఓ క్రేజీ అండ్ సెన్సేషనల్ న్యూస్ బయటకి వచ్చింది. ప్రస్తుతం నటసింహ నందమూరి బాలకృష్ణ తన మాస్ చిత్రం “వీర సింహా రెడ్డి” షూటింగ్ తో పాటుగా ఓటిటి లో టాక్ షో అయినటువంటి అన్ స్టాప్పబుల్ సీజన్ 2 ని కూడా చేస్తున్నారు.

నిన్ననే ఈ షో ఐదవ ఎపిసోడ్ ప్రోమో కూడా బయటకి రాగా ఇది కూడా మాస్ రెస్పాన్స్ ని అందుకుంది. అయితే ఇప్పుడు ఈ సీజన్లో మరో క్రేజీ ఎపిసోడ్ లాక్ అయ్యినట్టుగా ఇప్పుడు ఇన్సైడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇక రానున్న ఎపిసోడ్స్ లో అయితే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా బాలయ్య తో ఈ షోలో కనిపించనున్నాడని పలు వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి.

పైగా ప్రభాస్ ట్రస్టడ్ సినీ వర్గాలు కూడా ఇది నిజమే అని కన్ఫర్మ్ చేస్తున్నాయి. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా మరో న్యూస్ ఏమిటంటే బాలయ్య ప్రభాస్ లతో పాటలుగా ఈ ఎపిసోడ్ లో ఇంకో స్టార్ హీరో కూడా మెరవనున్నట్టుగా ఇపుడు తెలుస్తుంది.

మరి ఆ హీరో కూడా ఎవరో కాదట ప్రభాస్ కి  అలాగే టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ అన్నట్టు తెలుస్తుంది. మరి ఈ షూటింగ్ అయితే ఈ డిసెంబర్ రెండో వారంలో స్టార్ట్ కానున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ క్రేజీ కాంబినేషన్ లో ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూడాల్సిందే.