Supreme Court: వివాహేతర సంబంధాలు నేరం కాదని, ఇష్టపూర్వకంగా శారీరక సంబంధం పెట్టుకుంటే అదంతా వ్యక్తిగత విషయమని సుప్రీం కోర్టు గురువారం కీలక తీర్పు ఇచ్చింది. జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ కోటీశ్వర్ సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వివాదాస్పద అంశంపై అభిప్రాయాలు వెల్లడించింది. పెళ్లైన తర్వాత కూడా భార్య లేదా భర్త మరొకరితో ఇష్టంతో శృంగారంలో పాల్గొనడం నేరంగా పరిగణించలేమని స్పష్టం చేసింది.
ముంబైకి చెందిన ఓ కేసులో ఈ తీర్పు వెలువడింది. ఆ కేసులో ఏడేళ్ల క్రితం ఓ వ్యక్తిపై పెళ్లి హామీ పేరుతో శృంగారానికి ఒప్పించి, చివర్లో విడాకులు ఇచ్చినందుకు అత్యాచారం కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసును విచారించిన సుప్రీం కోర్టు, పెళ్లి హామీ పేరుతోనే శారీరక సంబంధం పెట్టుకున్నారని చెప్పడం సరైన కారణం కాదని, ఇష్టపూర్వక సంబంధం నేరంగా పరిగణించలేమని వ్యాఖ్యానించింది.
అయితే, మైనర్ బాలికల విషయంలో మాత్రం పూర్తి భిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. బాలిక 18 ఏళ్లు నిండకపోతే, సంబంధం ఇష్టపూర్వకమైనా అది నేరంగా పరిగణించబడుతుందని స్పష్టం చేసింది. సొంత భార్య అయినా 18 సంవత్సరాలు ఉంటే ఆమెతో శారీరక సంబంధం నేరమేనని తీర్పులో పేర్కొంది. ఇది అత్యాచార చట్టానికి అనుగుణంగా కఠినంగా అమలు చేయాల్సిన అంశమని ధర్మాసనం వెల్లడించింది.
అదే విధంగా, అత్యాచార బాధితురాలి పేరును బహిరంగం చేయడం, సంబంధిత వీడియోలు లేదా ఫోటోలను ప్రసారం చేయడం తీవ్ర నేరమని సుప్రీం కోర్టు గుర్తుచేసింది. బాధితుల గోప్యతను కాపాడడం అత్యంత కీలకమని సూచించింది. ఈ తీర్పుతో వివాహేతర సంబంధాలపై సమాజంలో తలెత్తుతున్న చర్చలకు పలు కోణాలు జతయ్యాయి. వ్యక్తిగత స్వేచ్ఛ, సమాజం, చట్టాల మధ్య సమతుల్యత కావాల్సిన అవసరం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడ్డారు.