Natural remedies: చిన్న వయసులోనే తెల్ల జుట్టా.. డైలు కాదు.. ఆయుర్వేదంలో దాగి ఉన్న నల్లజుట్టు సీక్రెట్ ఇదే..!

ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా తెల్ల జుట్టు సమస్య చాలామందిని వేధిస్తోంది. ఒకప్పుడు వృద్ధులకే పరిమితమైన ఈ సమస్య, ఇప్పుడు పిల్లలు, యువతలో కూడా కనిపిస్తోంది. కాలుష్యం, మారుతున్న ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడి, రసాయనాలతో కూడిన హెయిర్ ప్రొడక్ట్స్ వాడకం వల్ల జుట్టు ముందే తెల్లబడుతోంది. వెంటనే పరిష్కారం కోసం చాలామంది హెయిర్ డైలను ఆశ్రయిస్తున్నా, వాటిలోని రసాయనాలు జుట్టు ఆరోగ్యాన్ని మరింత దెబ్బతీసే ప్రమాదం ఉంది.

అయితే ఆయుర్వేదం, సంప్రదాయ గృహ చిట్కాలు తెల్లజుట్టు సమస్యకు సహజ పరిష్కారం చూపిస్తున్నాయి. ఆముదం నూనెతో కలిపిన ఉసిరి కాయల పొడి జుట్టు రంగును మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులోని విటమిన్ సీ మెలానిన్ ఉత్పత్తిని ప్రోత్సహించి, జుట్టును మళ్లీ సహజ నల్లరంగులోకి తీసుకువచ్చేందుకు సహాయపడుతుంది. వారానికి రెండు సార్లు ఈ మిశ్రమాన్ని వాడితే క్రమంగా ఫలితం కనిపిస్తుంది.

కరివేపాకు ఆకులు జుట్టుకు వరంలాంటివి. ఐరన్, కాల్షియం, విటమిన్ బి సమృద్ధిగా ఉండే కరివేపాకు పేస్ట్‌ను జుట్టుకు పట్టించడం వల్ల జుట్టు రూట్స్ బలపడతాయి. క్రమంగా తెల్ల జుట్టు తగ్గుతూ, నల్లగా మారడం ప్రారంభమవుతుంది. షాంపూ లేకుండా కడగడం వల్ల సహజ పోషకాలు జుట్టులోనే నిలుస్తాయి. గోరింటాకు ఆకులు, బెల్లం కలయిక కూడా పాతకాలం నుంచీ ఉపయోగిస్తున్న నమ్మకమైన చిట్కా. గోరింటాకు సహజ రంగు కారకంగా పనిచేస్తే, బెల్లం శరీరంలోని వేడిని తగ్గించి జుట్టుకు పోషణ అందిస్తుంది. ఈ మిశ్రమం వాడటం వల్ల జుట్టు రంగు మాత్రమే కాదు, మెరుపు కూడా పెరుగుతుంది.

బియ్యం నీటిని ఫెర్మెంటెడ్ చేసి జుట్టుకు ఉపయోగించడం కూడా మంచి ఫలితాలు ఇస్తుంది. ఇందులోని విటమిన్ ఈ, యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు వృద్ధిని పెంచి, తెల్ల జుట్టును తగ్గిస్తాయి. అలాగే తులసి ఆకులు, మామిడి ఆకులను కొబ్బరి నూనెలో మరిగించి వాడటం వల్ల జుట్టుకు ప్రాణవాయువు లభించి, మెలానిన్ ఉత్పత్తి మెరుగవుతుంది. మొత్తంగా చెప్పాలంటే, తెల్ల జుట్టుకు డైలు ఒక్కటే పరిష్కారం కాదు. క్రమం తప్పకుండా సహజ చిట్కాలను పాటిస్తే, జుట్టు ఆరోగ్యంగా, నల్లగా మారే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చిన్న వయసులోనే తెల్లజుట్టు సమస్య ఉన్నవారు ఈ సహజ మార్గాలను ఓసారి ప్రయత్నించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.