ఒక్కో ఇంటర్వ్యూకి బిత్తిరి సత్తి రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

బిత్తిరి సత్తి ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తీన్మార్ వార్తలు ద్వారా తన యాస, వేషధారణతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్న బిత్తిరి సత్తి అసలు పేరు రవికుమార్. ఈయన చేవెళ్ల ప్రాంతాలకు చెందిన రైతు కుటుంబంలో జన్మించారు. ఇలా ఒక రైతు కుటుంబంలో జన్మించిన బిత్తిరి సత్తి ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో తీన్మార్ వార్తల ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇలా ఈయన వేషధారణ ఆయన మాట తీరును చూడటం కోసమే చాలామంది ఈ తీన్మార్ వార్తలు చూసేవారు అంటే అతిశయోక్తి కాదు.

ఈ విధంగా తీన్మార్ వార్తల ద్వారా బిత్తిరిసత్తి కేవలం వేలలో తీసుకునేవారు. ఇక ఛానల్ మారిన తర్వాత ఈయన రెమ్యూనరేషన్ లక్షల్లోకి మారిపోయింది.ఇక ఒక యాడ్ చేయడం కోసం బిత్తిరిసత్తి ఏకంగా ఏడు లక్షల రూపాయల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక పోతే ఈ మధ్యకాలంలో పెద్ద సినిమాలు విడుదలకు ముందు పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరోలను బిత్తిరి సత్తి ఇంటర్వ్యూ చేయడం హైలెట్ అవుతుంది.

ఇప్పటికే త్రిబుల్ ఆర్, సర్కారు వారి పాట చిత్ర బృందానికి ఇంటర్వ్యూ నిర్వహించిన బిత్తిరిసత్తి తాజాగా ఎఫ్ 3 చిత్ర బృందంతో కూడా ఒక ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈ ఇంటర్వ్యూ సినిమా ప్రమోషన్లకు భారీ హైలెట్ అవుతుంది.ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూ చేయడం కోసం బిత్తిరి సత్తి యాంకర్ ల కన్నా ఎక్కువ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.ఈయన ఒక ఇంటర్వ్యూ చేస్తే సుమారు రెండు లక్షల రూపాయలు పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం.ఏది ఏమైనా బిత్తిరి సత్తి తన వ్యవహార శైలి మాట తీరుతో ఎంతో మంచి గుర్తింపు పొంది భారీ మొత్తంలోనే డబ్బు సంపాదిస్తున్నారని చెప్పవచ్చు.