బాక్సాఫీస్ దగ్గర ఆగని “ధమాకా”..లేటెస్ట్ వసూళ్లు ఎంతంటే.!

గత ఏడాది టాలీవుడ్ దగ్గర భారీ హిట్ గా నిలిచినటువంటి చిత్రాల్లో మాస్ మహారాజ రవితేజ హీరోగా దర్శకుడు త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన చిత్రం “ధమాకా” కూడా ఒకటి. మరి యంగ్ హీరోయిన్ శ్రీ లీల నటించిన ఈ చిత్రం రవితేజ కెరీర్ లో ఓ బిగ్గెస్ట్ హిట్ గానే కాకుండా తన కెరీర్ లో హైయెస్ట్ వసూళ్లు అందుకున్న సినిమాగా అయితే ఇది నిలిచింది.

ఇప్పటికే భారీ వసూళ్లు నమోదు చేసి క్రాక్ సినిమాని కూడా ధమాకా క్రాస్ చేయగా ఇప్పుడు స్టడీగా వసూళ్లు నమోదు అవుతున్నాయి. మరి సినిమా మూడో వారం కాస్త స్లో అయ్యింది కానీ ఫైనల్ గా వీకెండ్ మళ్ళీ ధమాకా దుమ్ము లేపుతున్నట్టు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.

లేటెస్ట్ గా అయితే మొన్న గురువారం వరల్డ్ వైడ్ కేవలం 1 కోటి గ్రాస్ ని మాత్రమే అందుకున్న ఈ చిత్రం ఈ శుక్రవారానికి మూడు కోట్లు పెరిగింది. దీనితో ఈ చిత్రం 16 రోజుల్లో టోటల్ గా 104 కోట్ల మాసివ్ వసూళ్లు నమోదు చేసింది. దీనితో ఈ చిత్రం 50 కోట్ల షేర్ దిశగా వెళ్లనున్నట్టుగా తెలుస్తుంది.

మరి ఇంకో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏమిటంటే ఈ సంక్రాంతి లో కూడా ధమాకా చిత్రానికి పలు స్క్రీన్స్ లో డిమాండ్ మేరకు తీయకుండా కంటిన్యూ చేస్తారట. దీనితో సంక్రాంతిలో కూడా ధమాకా మంచి వసూళ్లు అందుకుంటుంది అని ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు. మొత్తానికి అయితే ధమాకా మాత్రం నెక్స్ట్ లెవెల్ హిట్ అయ్యింది అని చెప్పి తీరాలి.