పవన్ “ఓజి” పవన్ క్రేజీ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.!

గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ రీమేక్ సినిమాలో అయితే తన పార్ట్ షూటింగ్ ని కంప్లీట్ చేసేసిన సంగతి తెలిసిందే. కాగా నెక్స్ట్ ఐతే ఏప్రిల్ నుంచే పవన్ తన ఉస్తాద్ భగత్ సింగ్ లో జాయిన్ కానున్నారని టాక్ ఉంది.

ఇలా పవన్ అయితే మరిన్ని ఇతర సినిమాలు చేస్తుండగా ఈ సినిమాలో పవన్ ఫ్యాన్స్ బాగా ఎగ్జైట్ అవుతున్న భారీ ఏక్షన్ సినిమా “ఓజి” కూడా ఒకటి. ఈ సినిమాని యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తుండగా ఈ సినిమాపై క్రేజీ అంచనాలు ఉన్నాయి.

అయితే ఇవన్నీ ఎప్పుడు మొదలు అవుతాయా అని చాలా మంది అనుకుంటున్నారు కానీ ఇప్పుడు సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో అయిపోతున్నాయి. లేటెస్ట్ గా అయితే ఈ సినిమా నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు క్రేజీ అప్డేట్ తో షాకిచ్చారు.

ఈ సినిమా సుజీత్ ఇప్పుడు విదేశాల్లో తన ఆర్ట్ డైరెక్టర్ ఏ ఎస్ ప్రకాష్ మరియు సినిమాటోగ్రాఫర్ రవి చంద్రన్ తో అయితే బిజీగా ఉన్నాడని కొన్ని ఫోటోలు కూడా షేర్ చేశారు. దీనితో పవన్ ఫ్యాన్స్ ఐతే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమా ఓ సాలిడ్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కనుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే షూటింగ్ అతి త్వరలోనే మొదలు కానున్నట్టే అనుకోవాలి.