Pawan-Balayya: టాలీవుడ్ హీరో నందమూరీ నటసింహం బాలకృష్ణ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ ఇద్దరు హీరోలు ప్రస్తుతం ఒకవైపు రాజకీయాలలో యాక్టివ్ గా పాల్గొంటూనే మరొకవైపు సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. ఒకరు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహింస్తుండగా మరొకరు హిందుపురం ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే వీరిద్దరూ రాజకీయాల్లో ఒకే కూటమిలో ఉండవచ్చు.
కానీ సినిమా ఇండస్ట్రీలో మాత్రం ఆ పోటీ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. నిజానికి ఈ ఇద్దరు హీరోల మధ్య ఆ ఆలోచన లేకపోయినా కూడా ఈ హీరోల ఫ్యాన్స్ మధ్య మాత్రం ఒక రేంజ్ లో నువ్వా నేనా అన్న రేంజ్ లో వార్ నడుస్తోంది. ఇప్పుడు తాజాగా ఈ ఇద్దరి ఫ్యాన్స్ మధ్య మరోసారి సోషల్ మీడియా వార్ మొదలయ్యింది. అదేంటంటే పవన్ ఓజీ సినిమా, బాలయ్య అఖండ 2 సినిమా రెండు ఒకే రోజున అనగా సెప్టెంబర్ 25 విడుదల అవ్వాలి. ఫ్యాన్స్ కూడా ఈ పోటీని చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఏ హీరో ఇంపాక్ట్ ఏ రేంజ్ లో ఉంటుంది అని.
దాంతో సోషల్ మీడియా వేదికగా దారుణంగా కామెంట్స్ కూడా చేసుకున్నారు. కానీ అన్యూహ్యంగా ఆ పోటీ నుంచి బాలకృష్ణ తప్పుకున్నాడు. షూటింగ్ పూర్తి కాని నేపధ్యంలో అఖండ 2ని వాయిదా వేస్తూ మేకర్స్ ప్రకటన చేశారు. దీంతో బాక్సాఫీస్ దగ్గర బీభత్సమైన పోరు ఉండబోతుంది అనుకున్న ఫ్యాన్స్ కి నిరాశే మిగిలింది. అలా సింగిల్ గా వచ్చిన ఓజీ రికార్డుల దుమ్ము దులిపింది. కలెక్షన్స్ పరంగా కూడా సునామి సృష్టించింది. కేవలం 11 రోజుల్లోనే రూ.300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు ఓజీ బ్లాక్ బస్టర్ సాధించింది ఇప్పుడు అఖండ 2 టైం స్టార్ట్ అయ్యింది అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ కనిపిస్తున్నాయి.
సినిమా వాయిదా పడింది కానీ పోటీ నుంచి కాదు. అంటూ రెచ్చిపోతున్నారు బాలయ్య ఫ్యాన్స్. అఖండ 2 సినిమా డిసెంబర్ 5న భారీ స్థాయిలో విడుదల కానుంది. బ్లాక్ బస్టర్ అఖండ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. డివోషనల్ అండ్ మాస్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తీర్చిదిద్దాడు దర్శకుడు బోయపాటి శ్శ్రీను. మొదటి పార్ట్ కి మించి ఈ సినిమా ఉండబోతుంది అని టీజర్ తోనే అర్థమయ్యింది. కాబట్టి, ఈ సినిమా కూడా భారీ విజయాన్నీ సాధించి అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. మరీ ఈ సినిమా విడుదల అయ్యి ఎలాంటి అంచనాలను క్రీయేట్ చేస్తుందో చూడాలి మరీ.
Pawan-Balayya: సోషల్ మీడియాలో పవన్ బాలయ్య ఫ్యాన్స్ మధ్య వార్.. హీరోలు తగ్గిన ఫ్యాన్స్ తగ్గడం లేదుగా!
