చిరంజీవి సరసన రష్మిక.. కూతురు కంటే చిన్న వయసు అమ్మాయితో రొమాన్స్ ఏంటి బాసు..?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నారు. మెగాస్టార్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత నేటి హీరోలకు ధీటుగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా అనంతరం మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమా షూటింగులతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలు మాత్రమే కాకుండా బాబీ దర్శకత్వంలో మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఇన్ని సినిమాలు లైన్ లో ఉండగా తాజాగా డైరెక్టర్ వెంకీ కుడుముల మెగాస్టార్ కి కథను చెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఈ సినిమాకి మెగాస్టార్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం మెగాస్టార్ చేస్తున్న సినిమాలన్ని పూర్తి అయిన తరువాత ఈ సినిమాని వచ్చే ఏడాది చివర్లో ప్రారంభిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే తాజాగా ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి సరసన నటించడం కోసం హీరోయిన్ రష్మికను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఈ విషయం సోషల్ మీడియాలో తెలియడంతో నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఇలా పలువురు నెటిజన్లు ఈ విషయంపై స్పందిస్తూ కూతురు వయసులో ఉన్న రష్మిక తో సినిమా ఏంటి బాసు అంటూ ఇతని పై దారుణంగా కామెంట్లు చేస్తున్నారు. చిత్ర బృందం నుంచి ఏ విధమైన ఎటువంటి అధికారిక ప్రకటన లేకుండానే నెటిజన్లు ఇలా స్పందించడం గమనార్హం. ఒకవేళ ఇదే కనుక నిజమైతే అధికారిక ప్రకటన వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది.