బిగ్ అప్డేట్ : “పఠాన్” ఓటిటి రిలీజ్ డేట్ ఇదే.!

ఈ ఏడాది పాన్ ఇండియా లెవెల్లో సెన్సేషనల్ హిట్ అయినటువంటి మొదటి సినిమా ఏదన్నా ఉంది అంటే ఆ సినిమా బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన సినిమా “పఠాన్” అనే చెప్పుకోవాలి. కాగా ఈ సినిమాని దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించగా దీనికి రికార్డు వసూళ్లు నమోదు అయ్యాయి.

అయితే ఈ భారీ సినిమా రిలీజ్ అయ్యి ఇన్ని రోజులు అయినప్పటికీ సెన్సేషనల్ రన్ ని కొనసాగిస్తుండగా ఫైనల్ గా సినిమా ఓటిటి రిలీజ్ కోసం చూస్తున్న వారికి గుడ్ న్యూస్ బయటకి వచ్చింది. మరి ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ సొంతం చేసుకున్న అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే ఈ సినిమా ఈ మార్చ్ 25 నుంచి అధికారికంగా రిలీజ్ కాబోతుంది.

మరి ఈ అప్డేట్ అయితే యూట్యూబ్ పఠాన్ యాడ్స్ లో మనం చూడొచ్చు. దీనితో ఈ సినిమా మార్చ్ 25 నుంచి ప్రైమ్ వీడియో లో అందుబాటులో ఉండనుంది అని చెప్పాలి. ఇక అందులో అయితే ఎలాంటి రికార్డులు ఈ సినిమా అందుకుంటుందో చూడాలి.

కాగా ఈ సినిమాలో మరో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా కీలక క్యామియో రోల్ లో కనిపించగా దీపికా పదుకొనె హీరోయిన్ గా జాన్ అబ్రహం విలన్ గా నటించాడు. అలాగే యష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మాణం వహించి వసూళ్లతో అంతకు మించిన లాభాలు అందుకున్నారు.