పనమ్మాయి కోసం అల్లు అర్జున్‌ వీడియో.. ఫాలోవర్లు పెరగాలని ఆశిస్తున్నట్లు వెల్లడి

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ఎంతోమంది హృదయాలను గెలుచుకున్నారు. తను ఒక పెద్ద స్టార్‌ అయి ఉండీ కూడా, తన ఇంట్లో పనిచేసే ఒక అమ్మాయికి ఫాలోవర్లు పెరగాలని ఉద్దేశంతో ఆ అమ్మాయితో ఒక చిన్న వీడియో చేసి, ఆమెకి ఎక్కువ ఫాలోవర్లు పెరగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు అల్లు అర్జున్‌ ని అభినందించకుండా ఉండలేకపోతున్నారు. ఆమె తన ఫాలోవర్లు ని పెంచుకోవాలని అనుకుంది, అందుకు ఆమె అందుకు తన యజమాని అయిన అల్లు అర్జున్‌ ని అడిగింది, అతను కూడా సరే అన్నాడు. ఆమెకి ఇప్పటికే పదమూడువేలమంది ఫాలోవర్లు వున్నారని, ఈ అల్లు అర్జున్‌ వీడియోతో అవి 30 వేలకు పైగా అవుతాయని అనుకుంటున్నట్టుగా చెప్పింది ఆమె.

అల్లు అర్జున్‌ కూడా ఆమెకి బాగా ఫాలోవర్లు పెరగాలని ఆశిస్తున్నానని చెప్పారు. ప్రస్తుతం ’పుష్ప 2’ సినిమాతో బిజీగా వున్నా అల్లు అర్జున్‌, తన ఇంట్లో పనిచేసే అమ్మాయిని పాపులర్‌ చెయ్యడం కోసం ఈ చిన్న వీడియో చెయ్యడంతో అల్లు అర్జున్‌ అందరి హృదయాల్ని గెలుచుకున్నారు. ఇప్పుడు ఇది సాంఫీుక మాధ్యమంలో విపరీతంగా వైరల్‌ అవుతోంది.