పుష్ప-2 భారీ రెమ్యునరేషన్స్.. ఎవరెవరికి ఎంతెంత ఇచ్చారంటే?

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన భారీ చిత్రం పుష్ప-2: ది రూల్ ప్రేక్షకుల ముందుకు రావడానికి సర్వం సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 80 దేశాల్లో 6 భాషల్లో విడుదలవుతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ హైప్ నెలకొంది. ఇప్పటికే రూ. 1000 కోట్లకు పైగా ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసినట్టు తెలుస్తోంది.

ఈ చిత్రంలో ప్రధాన తారాగణం అందరికీ భారీ రెమ్యునరేషన్‌ అందించారన్నది టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్. అల్లు అర్జున్ తన పారితోషికం కోసం లాభాల్లో షేర్ తీసుకోవడం ద్వారా రూ. 270-280 కోట్లు సంపాదించారని సమాచారం. సుకుమార్ ఈ చిత్రానికి నిర్మాతగా కూడా వ్యవహరించడంతో, ఆయన రెమ్యునరేషన్ రూ. 100 కోట్లకు పైగా ఉండొచ్చని అంచనా.

సినిమాలో హీరోయిన్‌గా నటించిన రష్మిక మందన్నకు రూ. 10 కోట్లు ఇచ్చారని తెలుస్తోంది. ఇక విలన్ పాత్రలో మెరిసిన ఫహాద్ ఫాజిల్ రూ. 8 కోట్లు అందుకున్నారట. ఐటెం సాంగ్‌లో స్టెప్పులేసిన శ్రీలీలకు రూ. 2 కోట్లు ఇచ్చారని టాక్. ఈ చిత్రానికి సంగీతం అందించిన దేవిశ్రీ ప్రసాద్ కూడా రూ. 5 కోట్లకు పైగా తీసుకున్నారని తెలుస్తోంది.

ఇంత భారీ స్థాయిలో పెట్టుబడులు, రెమ్యునరేషన్‌ లతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను ఎంత వరకు చేరుకుంటుందో చూడాలి. బెనిఫిట్ షోలు ఇప్పటికే అభిమానుల్లో ఉత్సాహం రగిలిస్తుండగా, తొలి రోజు కలెక్షన్లు కొత్త రికార్డులు సృష్టిస్తాయనడంలో సందేహమే లేదు.