Pushpa 2: సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 మూవీ పాన్ ఇండియా లెవెల్ లో డిసెంబర్ 5వ తేదీన విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరికొన్ని గంటల్లోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా దేశవ్యాప్తంగా పుష్ప రాజ్ మేనియా పీక్స్ కు చేరింది. ఇప్పటికే సెన్సార్ టాక్ కూడా బయటకు వచ్చేయటంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఈ జోష్ ను డబుల్ చేసే న్యూస్ ఒకటి ఫిలిం సర్కిల్స్ లో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ న్యూస్ ఏంటి అన్న విషయానికొస్తే.. మొన్నటి వరకు పుష్ప 3 ఉంటుంది అంటూ గట్టిగా వార్తలు వినిపించిన విషయం తెలిసిందే.
ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో మూవీ మేకర్స్ నుంచి పాజిటివ్ గానే స్పందన లభించింది. దీంతో పుష్ప 3 కన్ఫామ్ అయిపోయింది. దీంతో అల్లు ఫాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. సెన్సార్ అప్‌డేట్‌తో మరోసారి పుష్ప 3కి సంబంధించిన డిస్కషన్ మొదలైంది. సినిమా క్లైమాక్స్ లో పార్ట్ 3కి సంబంధించిన లీడ్ ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. అంతే కాదు ఆ లీడ్ ఆడియన్స్ ను ఓ రేంజ్ లో ఎగ్జైట్ చేస్తుందన్నది ఇన్‌సైడ్ టాక్. పుష్ప 3కి సంబంధించిన న్యూస్ మళ్లీ ట్రెండ్ అవుతుండటంతో అల్లు ఆర్మీలో జోష్ కనిపిస్తోంది.
ఆల్రెడీ పుష్ప2 మీద హైప్ నేషనల్ లెవల్ లో పీక్స్ లో ఉంది. ఇప్పుడు ఆ హీట్‌కు పుష్ప 3 అప్‌డేట్ కూడా యాడ్ అవ్వటంతో వైల్డ్ ఫైర్ లా స్ప్రెడ్ అవుతోంది పుష్పరాజ్ మేనియా. మరి నిజంగానే పుష్ప 2 క్లైమాక్స్ లో పుష్ప 3 కి సంబంధించిన సర్ప్రైస్ ఉంటుందా లేదా అన్నది తెలియాలి అంటే మరి కొన్ని గంటలు వేచి చూడాల్సిందే. అయితే భారీ అంచనాల నడుమ విడుదల కాబోతున్న ఈ సినిమా ఎలాంటి అంచనాలను క్రియేట్ చేస్తుందో చూడాలి మరి.