డిసెంబర్ 13న మిస్ యు మూవీ రిలీజ్.. మిస్ అవ్వొద్దంటున్న మూవీ మేకర్స్!

గత ఏడాది చిన్న మూవీ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నటుడు సిద్ధార్థ్, ఆషిక రంగనాథ్ హీరో హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ మూవీ మిస్ యు. కోలీవుడ్ డైరెక్టర్ ఎం. రాజశేఖర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 13న రిలీజ్ అవ్వబోతుంది.ఈ మేరకు మూవీ టీం రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తూ కొద్దిసేపు విరామం తరువాత మిస్ యు మీ హృదయాలని ఆకర్షిస్తుంది. మాయజాలం డిసెంబర్ 13న ప్రారంభం అవుతుంది, మిస్ అవ్వకండి అనే క్యాప్షన్ తో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సెవెన్ మైల్స్ పర్ సెకండ్ సంస్థ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది.ఈ సినిమాకి సంబంధించిన టీజర్స్ అండ్ ట్రైలర్స్ అన్నీ సినీ ప్రియులని ఫిదా చేశాయి. నిజానికి ఈ సినిమా నవంబర్ 29న విడుదల కావాల్సి ఉంది.అయితే తమిళనాడులో భారీగా కురుస్తున్న వర్షాలకి ఈ సినిమాని వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

లవ్ ఎంటర్టైలర్గా తెరకెక్కిన ఈ సినిమాలో సిద్ధార్థ ముందు లా తనలోని రొమాంటిక్ వైబ్స్ చూపించబోతున్నాడు, హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ, ప్రేమలో ఉన్న బలహీనతల చుట్టూ ఈ చిత్రకథ ఆకట్టుకునే విధంగా ఉంటుంది. బ్రేకప్ తర్వాత కూడా ప్రేమ ఎంత బలంగా మారుతుందో అని ఈ చిత్రంలో చూపించబోతున్నారు.మొత్తానికి ఒక ఫీల్ గుడ్ కంటెంట్ తో ఉండబోతుంది.

ప్రేమలో సెకండ్ ఛాన్స్ వస్తే ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఎంటర్టైనింగ్ గా అదేవిధంగా ఎమోషనల్ గా కూడా చెప్పినట్లు చిత్ర యూనిట్ వర్గాలు చెప్తున్నాయి. ఈ సినిమాలో జేపీ, పొన్వన్నన్, కరుణాకరన్, బాలసరవణన్ తదితరులు నటించారు. జిబ్రాన్ సంగీతం అందించిన ఈ సినిమాకి కేజీ వెంకటేష్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. ఈ సినిమాని ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోని డిస్ట్రిబ్యూషన్ చేస్తోంది. ఈ సినిమాతో అయినా సిద్ధార్థ్ మంచి కంబ్యాక్ ఇస్తాడేమో చూడాలి.