కొన్ని సంవత్సరాల పాటు వెండితెర మహారాజుగా వెలిగాడు మెగాస్టార్ చిరంజీవి. తర్వాత రాజకీయాల వల్ల బ్రేక్ ఇచ్చి మళ్లీ సినిమాలలోకి కం బ్యాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తెలుగు సినీ పరిశ్రమలో ఆల్మోస్ట్ మూడు దశాబ్దాల పాటు సినిమాలు మీద సినిమాలు చేస్తూ కోట్లాదిమంది అభిమానులని, మరెవరు అందుకోలేని స్టార్ డమ్ ని సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించారు కానీ అనుకున్నంత సక్సెస్ ని సాధించలేకపోయారు.
అయితే ఆయన ఫ్యాన్స్ మాత్రం ఆయన రొటీన్ కమర్షియల్ సినిమాల నుంచి బయటకు రావాలని మిగిలిన నటులు లాగా నేటి జనరేషన్ కి తగ్గట్టు సినిమాలు చేయాలని కోరుకుంటున్నారు. అయితే ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న చిరంజీవి పక్కా ప్లానింగ్ తోనే ఈసారి బరిలో దిగుతున్నారు. ప్రస్తుతం ఆయన బింబిసార డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమా చేస్తున్నారు. సోషియో ఫాంటసీ జోనర్ పై వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.
ఆ తర్వాత తన కూతురు సుస్మిత దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నారు మెగాస్టార్. ఈ సినిమాకి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించొచ్చు అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తో కూడా మెగాస్టార్ సినిమా చేయబోతున్నట్లు సినీ వర్గాల సమాచారం.ఆ తర్వాత కామెడీ సినిమాలు తీయటంలో ప్రసిద్ధిగాంచిన అనిల్ రావిపూడి తో ఒక కామెడీ ఎంటర్టైనర్ మూవీ ఉండబోతుంది.
ఇక తాజాగా నాని సమర్పణలో శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో ఒక సినిమాని అనౌన్స్ చేశారు. మోస్ట్ వైలెంట్ సినిమా అని అనౌన్స్ చేసి సినిమాపై అంచనాలు పెంచేశారు మూవీ టీం. 69 ఏళ్ళ వయసులో ఇంత భారీ లైన్ అప్ పెట్టి వర్క్ చేయటం అంటే మామూలు విషయం కాదు అని చిరు ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.
బాస్ ఇస్ బ్యాక్ అంటూ పండగ చేసుకుంటున్నారు.