Shobha Shetty: శోభా ఆటలు కన్నడ బిగ్ బాస్ లో సాగలేదా.. అందుకే మధ్యలోనే వెళ్లిపోయిందా.. వినలేముందు భారీ ట్విస్ట్!

Shobha Shetty: తెలుగు బుల్లితెరపై కార్తీకదీపం సీరియల్ ఎంత సెన్సేషన్ ను సృష్టించిందో మనందరికీ తెలిసిందే. టిఆర్పి రేటింగ్ లో నేషనల్ లెవెల్ లో రికార్డులు సృష్టించి ఇప్పటివరకు తెలుగు బుల్లితెరపై ఏ సీరియల్ చేయని రికార్డులను సాధించింది. కార్తీకదీపం సీరియల్ కి ముందు ఆ తర్వాత విడుదలైన ఏ సీరియల్ కూడా ఈ సీరియల్ తో పోటీ పడలేకపోయాయి. ఆ రేంజ్ లో సెన్సేషన్ ను సృష్టించింది. ఇకపోతే ఈ సీరియల్ లో విలన్ రోల్ లో నటించిన మోనిత అలియాస్ శోభా శెట్టి గురించి మనందరికీ తెలిసిందే. చాలామంది బుల్లితెర ప్రేక్షకులు శోభా శెట్టి అంటే గుర్తు పెట్టకపోవచ్చు కానీ కార్తీక దీపం మోనిత అంటే చాలు ఇత్తే గుర్తుపట్టిస్తారు. అంతలా ఆ క్యారెక్టర్ ఈమెకు గుర్తింపుని తెచ్చిపెట్టింది.

కార్తీకదీపం సీరియల్ లో భారీగా క్రేజ్ ని తెచ్చుకున్న శోభా శెట్టి అదే ఊపుతో తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో పాల్గొన్న విషయం తెలిసిందే. చివరి వరకు పోరాడుతూ వచ్చింది. బోలెడంత నెగటివిటీని తెచ్చుకోవడం తో పాటు విమర్శల పాలయ్యింది. శోభ మాట తీరు, యాటిట్యూడ్ చిరాకు తెప్పించేవి. ఆమె నామినేషన్స్ లో ఉన్న ప్రతిసారి ఎలిమినేట్ చేయాలి అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వెల్లువెత్తేవి. స్టార్ మా ఆమెను కాపాడుతూ వచ్చిందనే వాదన కూడా ఉంది దానికి తోడు శోభా శెట్టి వంటి ఫైర్ బ్రాండ్ షోలో ఉంటేనే మజా అని మేకర్స్ భావించి ఉండవచ్చు. శోభ శెట్టి ఫినాలేకి ఒకటి రెండు వారాల ముందు ఎలిమినేట్ అయ్యింది. ఆ సంగతి పక్కన పెడితే ఇటీవల కన్నడ బిగ్ బాస్ హౌస్ లోకి శోభా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. కొందరు వైల్డ్ కార్ద్ ఎంట్రీ ఇచ్చారు. వారిలో శోభ శెట్టి ఒకరు.

పరాయి భాషకు చెందిన బిగ్ బాస్ షోలోనే నిప్పులు చెరిగిన శోభ, కన్నడ షోలో సంచలనాలు చేయడం ఖాయమని అనుకున్నారు. శోభ శెట్టి కన్నడ అమ్మాయి అన్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ కన్నడలో కూడా శోభ శెట్టి తన మార్క్ అగ్రెషన్ చూపించింది. తన జోలికి వచ్చిన వారిపై విరుచుకుపడేది. ఈ వారం నామినేషన్స్ లో ఉన్న శోభ శెట్టి సేవ్ అయ్యింది. అయినప్పటికీ నేను హౌస్ లో ఉండలేనంటూ కన్నీరు పెట్టుకుంది. వెళ్లిపోతానని హోస్ట్ సుదీప్ ని అభ్యర్థించడంతో ఆయన అందుకు అంగీకరించారు. శోభ సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యింది. శోభ నిర్ణయానికి అనారోగ్య సమస్యలే కారణం అని తెలుస్తోంది. అందుకే షోకి శోభ గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఫినాలే ఎపిసోడ్ దగ్గర పడుతున్న సమయంలో శోభా సెల్ఫీ ఎలిమినేట్ అయ్యి అభిమానులకు పోషించిన షాక్ ఇచ్చింది. అయితే తెలుగులో శోభ ఆటలు సాగినట్టు కన్నడలో ఆటలు సాగలేదు అనుకుంటా అందుకే ఎలిమినేట్ అయ్యింది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.