నాని నిర్మాణంలో నటిస్తున్న చిరంజీవి.. చాలా గర్వంగా ఉందంటున్న నాచురల్ స్టార్!

మెగాస్టార్ చిరంజీవికి చాలా కాలంగా సరియైన హిట్ లేదని చెప్పాలి. కం బ్యాక్ ఇచ్చిన తర్వాత వాల్తేరు వీరయ్య తప్పితే ఆయనకి సరైన హిట్ పడలేదు. ఈ క్రమంలోనే ఆయన హీరో నానితో చేయి కలిపి ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో చిరంజీవి నటిస్తారని చాలా రోజులుగా వార్తలు విలువబడుతున్నాయి.

అయితే అదే సమయంలో ఈ వార్త అధికారికంగా వెలువడింది. ఈ సినిమాని నాచురల్ స్టార్ నాని యునానిమస్ ప్రొడక్షన్స్ సమర్పణలో ఎస్ ఎల్ వి సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మించనున్నారు. ఈ సినిమా గురించి డిసెంబర్ మూడవ తేదీ రాత్రి ప్రకటించారు. దీనికి సంబంధించి ఒక పోస్టర్ రిలీజ్ చేస్తూ అతను తన ప్రశాంతతని వైలెన్స్ లో వెతుక్కుంటాడు అని కొటేషన్ కూడా రాశారు.

ఈ పోస్టర్లో రక్తం కారుతున్న చిరంజీవి చేయి ఉంది. ఇది చిరంజీవి కెరీర్ లోనే మోస్ట్ వైలెంట్ ఫిలిం అని అనౌన్స్ చేశారు.ఈ సినిమా గురించి మరొక అప్డేట్ ఇచ్చారు నాని. బ్లడీ ప్రామిస్ అంటూ ఈ సినిమా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ అని పరోక్షంగా చెప్పారు. విశ్వంభర సినిమాతో వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి రాబోతున్న చిరంజీవి ఆ తరువాత చేయబోయే సినిమా ఇది. అలాగే శ్రీకాంత్ ఓదెల కూడా తను డైరెక్ట్ చేస్తున్న పారడైజ్ మూవీ తర్వాత ఈ ప్రాజెక్టులో జాయిన్ అవుతారని సమాచారం.

ఈ సినిమా గురించి నాని మాట్లాడుతూ నేను ఆయన్ని చూస్తూ పెరిగాను, ఆయన సినిమా టికెట్ కోసం లైన్లో నుంచున్నాను, ఆయన కోసం నా సైకిల్ పోగొట్టుకున్నాను ఇప్పుడు ఆయన్ని నేను ప్రజెంట్ చేస్తున్నాను. ఆయన సినిమాని నిర్మించడం ఒక గర్వకారణం. మనమందరం ఎదురుచూస్తున్న మెగాస్టార్ మేడ్నెస్ రాబోతుంది అని చెప్పారరు. ఇక శ్రీకాంత్ ఓదెల సోషల్ మీడియాతో మాట్లాడుతూ ఫ్యాన్ బాయ్ తాండవం ఎలా ఉంటుందో చూపిస్తాను అని అనౌన్స్ చేశారు.