Balakrishna: ఆదిత్య 369 సీక్వెల్ పై అలా రియాక్ట్ అయినా బాలయ్య బాబు.. హీరోగా ఎవరు నటిని ఇస్తున్నారో తెలుసా?

Balakrishna: టాలీవుడ్ హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన ఐకానిక్ సినిమాలలో ఆదిత్య 369 సినిమా కూడా ఒకటి. శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా 1991లో విడుదల అయ్యి అప్పట్లోనే బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకుంది. అంతేకాకుండా థియేటర్లలో వసూళ్ల సునామీని సృష్టించింది. ఇంకా చెప్పాలంటే ఇప్పటికీ ఈ సినిమాకు సపరేట్ ఫ్యాన్స్ బేస్ ఉంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా ఇప్పటికీ టీవీలో ప్రసారమైతే టీవీలకు అతుక్కునిపోయి చూసే వారు చాలామంది ఉన్నారు. ఇందులో బాలకృష్ణ, మోహిని, సిల్క్ స్మిత, శుభలేఖ సుధాకర్, గొల్లపూడి మారుతిరావు, చంద్రమోహన్ వంటి ప్రముఖులు కీలకపాత్రల్లో నటించిన విషయం తెలిసిందే.

హీరో తరుణ్ బాలనటుడిగా కనిపించారు. ఇక ఈ సినిమా సీక్వెల్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా సీక్వెల్ పై బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలయ్య బాబు హోస్టుగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 4 కార్యక్రమంలో భాగంగా ఈ సినిమా గురించి స్పందించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో భాగంగా బాలయ్య బాబు మాట్లాడుతూ.. ఆదిత్య 369కు సీక్వెల్ గా ఆదిత్య 999 రానుంది. మా అబ్బాయి మోక్షజ్ఞ తేజ హీరోగా యాక్ట్ చేయనున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పనులు జరగుతున్నాయి.

త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది అని తెలిపారు బాలయ్య బాబు. అయితే ఇందుకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ ప్రోమో ఫుల్ ఎపిసోడ్ డిసెంబర్ 6న స్ట్రీమింగ్ కానుంది. ఈ ఎపిసోడ్ ప్రారంభంలో ఆదిత్య 369 సినిమాకు సంబంధించిన గెటప్ లో కనిపించారు బాలయ్య. ప్రస్తుతం ఈ ఫోటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ఆదిత్య 369 సీక్వెల్ విషయంలో అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గుడ్ న్యూస్ ని చెప్పడంతో ప్రస్తుతం బాలయ్య బాబు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఇప్పటికే నందమూరి మోక్షజ్ఞ లుక్ కి సంబంధించిన ఫోటో ని మూవీ మేకర్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇది వరకు ఎప్పుడు లేని విధంగా సరికొత్త లుక్ లో కనిపించారు మోక్షజ్ఞ.