Pushpa 2 Byreddy Sabari: ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా పుష్ప సినిమా మేనియానే కనిపిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో సోషల్ మీడియాతో పాటు ఇండియా లెవెల్లో పుష్ప సినిమా పేరే వినిపిస్తోంది. అలాగే ఈ సినిమా పట్ల కొంచెం వ్యతిరేకత కూడా కనిపిస్తోంది. కొందరు టిడిపి నేతలు ఈ సినిమాను టార్గెట్ చేసినట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఆ సంగతి పక్కన పెడితే తాజాగా హీరో అల్లు అర్జున్ ని ఉద్దేశించి నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ట్విట్టర్ లో ఒక వివాదాస్పద ట్వీట్ చేశారు. ఆ పోస్టులో ఈ విధంగా రాసుకొచ్చారు బైరెడ్డి శబరి.
అల్లు అర్జున్ గారూ.. మీరు నంద్యాలలో చేసిన ఎన్నికల ప్రచారం ఇక్కడి ప్రజలకు ఇప్పటికీ మరువలేనిది. మీరు నంద్యాలలో ముందస్తు ఎన్నికల ప్రచారంలా ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందని మేము ఆశిస్తున్నాము. మీరు నంద్యాలను సందర్శించినప్పుడు మీ సెంట్‌మెంట్ మాకు చాలా బాగా పనిచేసింది. ఆ సెంట్‌మెంట్ మాదిరిగానే మీ పుష్ప 2 కూడా పాన్ ఇండియా స్థాయిలో విజయాన్ని సాధించాలని మేము హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము అని పేర్కొన్నారు. అయితే సదురు ఎంపీ చేసిన ట్వీట్ వెటకారం గానే ఉంది.
అందుకు సంబంధించిన పోస్ట్ క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అల్లు అర్జున్ అభిమానులు ఆమెపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ కామెంట్లు చేశారు. దాంతో వెంటనే సదురు ఎంపీ ఆ పోస్ట్ ని డిలీట్ చేసింది. అయితే 2024 ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ నంద్యాలలో వైసీపీ తరఫున ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. తర్వాత నుంచి ఇప్పటివరకు అల్లు అర్జున్ పై మెగా అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. అయితే తాజాగా ఎంపీ అల్లు అర్జున్ పర్యటించడం వల్ల వైసీపీ ఓడిపోయిందని తద్వారా టిడిపి గెలిచిందని వెటకారంగా ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ చాలా వైరల్ గా మారుతుందని గమనించిన ఆమె తెలివిగా వెంటనే ఆ ట్వీట్ ని డిలీట్ చేసింది.