Chiranjeevi: ఆరుపదుల వయసులో యంగ్ హీరోలకు పోటీని ఇస్తున్న మెగాస్టార్ చిరంజీవి.. లుక్ పూర్తిగా మార్చేసారుగా!

Chiranjeevi: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిరంజీవి ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. కొడుకు రామ్ చరణ్ కు దీటుగా ఈ వయసులో కూడా పరసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు చిరంజీవి. ఈతరం హీరోలకు గట్టి పోటీని ఇస్తున్నారు. జయ అపజయాలతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు మెగాస్టార్. వయసు పెరుగుతున్న కొద్దీ మరింత ఎనర్జిటిక్ గా మారుతూ సినిమాలు చేస్తున్నారు. ఇప్పటి కుర్రాళ్లకు పోటీ ఇచ్చేలా తయారవుతున్నారు.

కాగా గత ఏడాది సంక్రాంతికి వాల్తేర్ వీరయ్య చిత్రంతో బాక్స్ ఆఫీస్ వద్ద బీభత్సం సృష్టించిన మెగాస్టార్ త్వరలో విశ్వంభర అనే ఫాంటసీ చిత్రంతో ప్రేక్షకులను అలరించబోతున్నారు. ఈ మూవీ తర్వాత సుస్మిత కొణిదల నిర్మాణంలో మరొకచిత్రం చేయనున్నారు చిరంజీవి. ఇక తాజాగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మరొక మూవీని ప్రకటించారు. ఆ తర్వాత అనిల్ రావిపూడి తో ఒక కామెడీ ఎంటర్టైనర్ ఉండనే ఉంది. ఇలా భారీ లైన్ తో చిరు ఫుల్ బిజీగా ఉన్నారు. చేతినిండా బోలెడు సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు మెగాస్టార్. అయితే ఇలాంటి నేపథ్యంలో తాజాగా మెగాస్టార్ షేర్ చేసిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

ఆ ఫోటోలలో మెగాస్టార్ చిరంజీవి ఒక 20 ఏళ్ల వెనక్కి వెళ్లిపోయినట్టుగా కనిపిస్తున్నాడు. ఆరుపదుల వయసులో 35 ఏళ్ల వ్యక్తి లాగా కనిపిస్తూ అందరికీ ఒక్కసారిగా షాక్ ఇచ్చారు మెగాస్టార్. బ్లాక్ స్వేట్ షర్ట్, డెనిమ్ జీన్స్ తో చిరు వింటేజ్ లుక్స్ అందరినీ ఫిదా చేస్తున్నాయి. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో మెగాస్టార్ ఇస్ బ్యాక్ అంటూ కామెంట్ చేస్తున్నారు మెగా అభిమానులు. నిజంగా మెగాస్టార్ చాలా యంగ్ గా కనిపిస్తున్నారు. 20 ఏళ్ల వెనక్కి వెళ్లినట్లు ఉన్నారు. ఈ లుక్ లో మెగాస్టార్ లుక్ అదిరిపోయింది అంటూ కామెంట్లు చేస్తున్నారు.