Naga Chaitanya–Rana: పెళ్లి రోజే నాగచైతన్య ఇంటర్వ్యూ ప్రోమో రిలీజ్ చేసిన రానా.. లైఫ్ గురించి అలాంటి కామెంట్ చేసిన చై!

Naga Chaitanya–Rana: టాలీవుడ్ హీరో రానా దగ్గుపాటి ఇప్పటికే చాలా రకాల షోలకి హోస్ట్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే. తాజాగా కూడా అమెజాన్ ఓటీటీ లో ది రానా దగ్గుబాటి షో అనే పేరుతో టాక్ షో మొదలుపెట్టారు. అయితే ఇప్పటికే ఈ షో కి సంబంధించి రెండు ఎపిసోడ్ విడుదలైన విషయం తెలిసిందే. తాజాగా మూడో ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు రానా. అయితే ఈ మూడో ఎపిసోడ్ కి హీరో నాగచైతన్యతో పాటుగా రానా వైఫ్ మిహిక కూడా హాజరైంది. వీరితో పాటు ఇంకా కొందరు రానా ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చినట్టు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ప్రోమో వైరల్ గా మారింది. ఆ ప్రోమోలో రానా మా ఫ్యామిలీ అంతా కలిసి సోది వేసుకుంటే ఎలా ఉంటుందో తెలుసా అని మొదలుపెట్టాడు.

నాగ చైతన్య పెళ్లి గురించి, పర్సనల్ లైఫ్ ఎలా ఉంది అని అడిగాడు రానా. చైతు పర్సనల్ లైఫ్ కి ఏమైంది బాగుంది అని అన్నాడు. ఇక రానా భార్య మెహీక కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చినట్టు ప్రోమో చూస్తే తెలుస్తోంది. అలాగే షోలో చైతు, శోభిత ఫొటోలు కూడా చూపించి వాళ్ళ లవ్ గురించి మాట్లాడించినట్టు తెలుస్తోంది. అయితే ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ శనివారం నాడు అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కానుంది. ఇకపోతే నేడు నాగచైతన్య, శోభితల పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. కానీ ఇప్పటివరకు ఈ జంటకు సంబంధించిన పెళ్లి ఫోటోలు బయటకు రాలేదు.

 

ఒక్క ఫోటోని కూడా బయటికి రాకుండా చాలా జాగ్రత్త పడ్డారు అక్కినేని ఫ్యామిలీ. అయితే ఈ పెళ్లి ఫోటోలు కాస్త ఆలస్యంగా విడుదల చేస్తారా లేదంటే వీరి పెళ్లి వేడుకలు ముందుగా సోషల్ మీడియా వినిపించినట్టు ఏదైనా ఓటిటి ప్లాట్ఫామ్ దక్కించుకుందా అన్నది తెలియాల్సి ఉంది. అయితే మొన్నటి వరకు పెళ్లికి సంబంధించినప్పుడు శోభిత కూడా కొన్ని ఫోటోల ద్వారా తెలిపింది. కానీ నేడు పెళ్లి జరిగినట్టు ఎక్కడ వచ్చినా లీక్ అవ్వకుండా చాలా బాగా జాగ్రత్త పడుతున్నారు. దీంతో అభిమానులు పెళ్లి జరిగిందా లేక ఆగిపోయిందా అన్న అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు.