సినీ సెలబ్రిటీలు ఎప్పుడూ ఎవరి ప్రేమలో పడతారో చెప్పటం కష్టం. అలాగే ఎప్పుడు కలిసి ఉంటారో, ఎప్పుడు బ్రేకప్ చెప్పుకుంటారో కూడా చెప్పటం కష్టం. ఇప్పుడు ఈ మాటలు అన్ని ఎందుకు అనుకుంటున్నారా అదేనండి మన మెగా డాటర్ నిహారిక గురించి. ఆమె మళ్లీ పెళ్లి పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. నిహారిక తొలుత యాంకర్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టే సక్సెస్ అయ్యింది, తర్వాత హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది కానీ సక్సెస్ కాలేకపోయింది.
ఆ తర్వాత పెద్దల ఇష్ట ప్రకారం జొన్నలగడ్డ వెంకట చైతన్య అనే అబ్బాయిని పెళ్లి చేసుకుంది. పెళ్లి అయిన రెండు సంవత్సరాలకే విడాకులు తీసుకుంది. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ ప్రేమలో ఉందనే వార్తలు హల్ చల్ చేస్తోంది. ఈమె ప్రేమకి కుటుంబ సభ్యులు ఎవరు అడ్డు చెప్పలేదంట, పెళ్లి కూడా త్వరలోనే చేసుకోబోతున్నట్లు సమాచారం వరుడు కూడా ఇండస్ట్రీకి సంబంధించిన వాడే అంటున్నారు.
అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉన్నది పూర్తిగా తెలియదు, అయితే నిహారిక పెళ్లికి సంబంధించిన వార్తలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక ఈమె కెరియర్ విషయానికి వస్తే యాంకర్ గా కెరియర్ ప్రారంభించి తర్వాత ముద్దపప్పు ఆవకాయ అనే షార్ట్ ఫిలింలో హీరోయిన్ గా చేసింది తర్వాత 2016లో ఒక మనసు సినిమాతో వెండి తెరపై మెరిసింది తర్వాత సూర్యకాంతం సినిమాలోనూ నటించింది కానీ ఇవేమి పెద్దగా ఆమె కెరీర్ కి ఉపయోగపడలేదు.
ఆ తరువాత పెళ్లి, గొడవలు, విడాకులు ఇలా పర్సనల్ లైఫ్ మీద దృష్టి పెట్టడం వలన కెరియర్ పరంగా విరామం తీసుకుంది. ఇప్పుడు 2023లో డెడ్ పిక్సెల్స్ అనే వెబ్ సిరీస్ లో నటించి తర్వాత నిర్మాతగా కూడా మారింది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ ని నిర్మించి కమిటీ కుర్రాళ్ళు అనే సినిమా తీసి మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ భామ రెండవసారి చేసుకోబోయే పెళ్లి అయినా పది కాలాలపాటు పదిలంగా ఉండాలని కోరుకుంటున్నారు మెగా ఫ్యాన్స్.