Bollywood: పుష్ప విలన్ తో జోడిగా నటించబోతున్న యానిమల్ హీరోయిన్.. సెట్స్ పైకి వెళ్ళేది అప్పుడే!

Bollywood: మాలీవుడ్ నటుడు ఫహద్ ఫాసిల్ గురించి మనందరికీ తెలిసిందే. పుష్ప సినిమాతో భారీగా క్రేజ్ ని తెచ్చుకున్నాడు. అంతకుముందు తెలుగు తమిళ మలయాళ భాషల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఫహద్ ఫాసిల్. ఇప్పుడు బాలీవుడ్ లోకి అడుగుపెట్టబోతున్నాడు. ఇప్పుడు హిందీ మార్కెట్లో తనంటే ఏంటో రుజువు చేసుకోవడానికి సిద్ధమయ్యాడు ఫహద్ ఫాసిల్. ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో రూపొందే లవ్ స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. అయితే ఇప్పుడు ఈ హీరోకి జోడిగా బాలీవుడ్ హీరోయిన్ ఎంపిక చేసినట్టు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. నిజంగా ఆ కాంబో ఎవరు ఊహించనిది అని చెప్పాలి. ఆ హీరోయిన్ మరెవరో కాదు.

యానిమల్ ఫేమ్ త్రిప్తి డిమ్రి. ఈమెను ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తోంది. విండో సీట్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఇంతియాజ్ స్వీయ నిర్మాణంలో భారీ బడ్జెట్ తో రూపొందుతుందట. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నిజంగా ఇది షాకింగ్ కాంబినేషన్, అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజెన్స్. కాగా జబ్ వీ మెట్ తో గుర్తింపు తెచ్చుకున్న ఇంతియాజ్ అలీతో మనకూ కొంత కనెక్షన్ ఉంది. ఇతను తీసిన సూపర్ హిట్ మూవీ లవ్ ఆజ్ కల్ నే త్రివిక్రమ్ శ్రీనివాస్ రచనలో జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ తీన్ మార్ గా రీమేక్ చేశారు. కాని అది ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేదు. కానీ ఇంతియాజ్ టేకింగ్ విపరీతంగా నచ్చడం వల్లే పవర్ స్టార్ దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అప్పట్లో టాక్ వచ్చింది.

కొంత కాలంగా రేసులో వెనుకబడిపోయిన ఇంతియాజ్ అలీ ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన అమర్ సింగ్ చమ్కీలాతో తిరిగి ఫామ్ లోకి వచ్చాడు. దానికి రెస్పాన్స్, అవార్డులు భారీ ఎత్తున పేరు తీసుకొచ్చాయి. ఇకపోతే పుష్ప విలన్, యానిమల్ హీరోయిన్ జంటగా త్వరలో సినిమా చూడొచ్చన్న మాట. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుండగా త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఫహద్, త్రిప్తి డిమ్రి ల కాంబో ఎలా ఉంటుందో చూడాలి మరి.