Tollywood: పెళ్లి పీటలు ఎక్కబోతున్న మరో టాలీవుడ్ హీరో.. త్వరలో పెళ్లి అంటూ హీరో తండ్రి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Tollywood : ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. వరుసగా ఒకరి తరువాత ఒకరు సెలబ్రిటీలు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. అటు హీరోయిన్లు ఇటు హీరోలు బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బాయ్ చెబుతూ వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్నారు. అలాగే సీనియర్ హీరో హీరోయిన్ల పిల్లలు కూడా పెళ్లిళ్లు చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నారు. అయితే ఇప్పటికే శర్వానంద్, వరుణ్ తేజ్, అభిరామ్ వంటి పలువురు హీరోలు పెళ్లిళ్లు చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. కీర్తి సురేష్, నాగచైతన్య, నటుడు సుబ్బరాజు ఇలా ఒకరి తర్వాత ఒకరు పెళ్లి పీటలు ఎక్కుతున్న విషయం తెలిసిందే. అక్కినేని నాగార్జున పెద్ద కొడుకు, హీరో నాగచైతన్య పెళ్లి నేడు డిసెంబర్‌ 4న అన్నపూర్ణ స్డూడియోలో జరిగింది.

ఇక నాగార్జున రెండో కొడుకు అక్కినేని అఖిల్‌ పెళ్లి కూడా త్వరలో జరగనుంది. ఈ నెలలోనే కిర్తీ సురేశ్‌ పెళ్లి కూడా జరగనుంది. ఇక ఇప్పటికే టాలీవుడ్ నటుడు సుబ్బరాజు కూడా ఒక ఇంటివాడయ్యాడు. ఇక ఇప్పుడు మరో టాలీవుడ్‌ యంగ్‌ హీరో కూడా వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఆ హీరో మరెవరో కాదు బెల్లం కొండ సాయి శ్రీనివాస్‌. అవునండి మీరు విన్నది నిజమే. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్‌ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్రినివాస్‌, తొలి సినిమా అల్లుడు శ్రీనుతోనే బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టాడు. ఈ సినిమా తర్వాత చాలా సినిమాలలో నటించినప్పటికీ ఆ సినిమాలు ఏవి ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయాయి. ఈ యంగ్‌ హీరో నటించిన చిత్రాలన్ని ఆశించిన స్థాయిలో ఆడలేదు.

దీంతో కాస్త గ్యాప్‌ తీసుకొని ఓకేసారి మూడు సినిమాలతో ప్రేక్షకుల మందుకు రాబోతున్నాడు. ఇలా కెరీర్‌ పరంగా ఫుల్‌ బిజీగా ఉన్న శ్రీనివాస్‌ ఇప్పుడు కాస్త గ్యాప్‌ తీసుకొని పెళ్లి చేసుకోబోతున్నాడు. త్వరలోనే శ్రీనివాస్‌ పెళ్లి ఉంటుందని ఆయన తండ్రి బెల్లంకొండ సురేశ్‌ చెప్పారు. నిర్మాతగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తాజాగా సురేశ్‌ మీడియాతో ముచ్చటించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. శ్రీనివాస్‌ పెళ్లి త్వరలోనే ఉంటుందని చెప్పారు. ఇక గణేశ్‌ పెళ్లికి కాస్త సమయం ఉందని అన్నారు. శ్రీనివాస్‌ ది పెద్దలు కుదిర్చిన సంబంధమేనట. సినిమా ఇండస్ట్రీకి ఎలాంటి సంబంధం లేని అమ్మాయిని శ్రీనివాస్‌ పెళ్లి చేసుకోబోతున్నాడని సురేశ్‌ వెల్లడించారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో టాలీవుడ్ సినీ ప్రేక్షకులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇలా వరుసగా ఒకరి తర్వాత ఒకటి సెలబ్రిటీలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.