పవన్ దెబ్బ..బాలయ్యతో ఎపిసోడ్ ట్రాఫిక్ కి అన్ని జాగ్రత్తలు.!

మాస్ గాడ్ నందమూరి బాలకృష్ణ అలాగే గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లను ఒకే వేదిక మీదకి తీసుకొచ్చిన సంస్థ “ఆహా”. ఎన్నో ఏళ్ల తర్వాత వీరి సంచలన కలయిక సాధ్యం కావడం అది కూడా ఓ టాక్ షో కోసమే కాగా దీనిపై అనేక అంచనాలు ఉన్నాయి. మరి ఈ అవైటెడ్ ఎపిసోడ్ ని అయితే ఒక రోజు ముందే అంటే ఈరోజే ఆహా లో స్ట్రీమింగ్ కి తీసుకువస్తుండగా దీనిపై భారీ హైప్ ఉంది.

కాగా ఈ ఎపిసోడ్ కి భారీ ట్రాఫిక్ వస్తుందని అయితే ఆహా యాజమాన్యం అంచనా వేస్తుంది. ఎపిసోడ్ స్టార్ట్ కాగానే మినిమమ్ తాము 20 లక్షల మంది ఈ ఎపిసోడ్ చూస్తారని అంచనా వేస్తున్నామని అందుకే అందుకు తగ్గట్టుగా తమ యాప్ ని సర్వర్ లని ప్రిపేర్ చేసి ఉంచామని వెల్లడి చేశారు.

ప్రస్తుతానికి భారీ ట్రాఫిక్ ని అంచనా వేస్తున్నారు. లాస్ట్ టైం ప్రభాస్ ఎపిసోడ్ కి  క్రాష్ అయ్యిపోయిందో తెలిసిందే. ఇక ఇప్పుడు పవన్ ఎపిసోడ్ కాబట్టి మరిన్ని జాగ్రత్తలు వీరు తీసుకున్నామని చెప్పారు. దీనితో పవన్ దెబ్బ ముందే అంచనా వేసి పలు జాగ్రత్తలు తీసుకున్నారు.

మరి ఈ సూపర్ ఎపిసోడ్ మాత్రం ఎలాంటి రెస్పాన్స్ ని కొల్లగొడుతుందో చూడాలి. కాగా ఈ ఎపిసోడ్ ఈరోజు ఫిబ్రవరి 2న రాత్రి 9 గంటల నుంచి ఆహా లో స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉండనుంది. మరి ఇది మొదటి పార్ట్ కాగా రెండో పార్ట్ తర్వాత స్ట్రీమింగ్ కి రానుంది.