ఎన్టీఆర్ : నందమూరి వారసుడు ఎన్టీఆర్ తన ప్రతిభతో ఒక్కోమెట్టు ఎక్కుతూ సినీ పరిశ్రమలో టాప్ హీరో రేంజ్ కి వెళ్ళాడు. ఎంత ఎత్తుకు వెళ్లిన ఒదిగి ఉన్నాడు ఎన్టీఆర్. తన నటనతో డాన్సులతో అందరిని అకట్టుకున్నాడు. ప్రతి సినిమాలోనూ తన నటన ప్రతిభతో సీనియర్ నటులతో పోటీపడుతూ అభిమానులను సంతోషపెడుతున్నాడు.
ఇక మూడేళ్లుగా ఎదురుచూస్తున్న జక్కన్న సినిమా ఆర్ఆర్ఆర్ విడుదలయింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటించాడు. ఇక ఎన్టీఆర్ నటన గురించి అభిమానులకు ఎటువంటి సందేహం లేదు ఇక ఇటు విమర్శకులు కూడా తన నటనకు ఫిదా అవుతుంటే అభిమానుల్లో ఆనందం రెట్టింపుఅయింది
ఇక సినిమా కలెక్షన్లు కూడా అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. ఇక సినిమాలో నటించిన రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్ లకు కూడా మొదటిసారి బాలీవుడ్ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకోవడమే కాకుండా భారీ స్థాయిలో ఆఫర్స్ కూడా అందుకుంటున్నారు. ఇక పెరుగుతున్న డిమాండ్ తో ఇటీవల ఒక బాలీవుడ్ బడా సంస్థ జూనియర్ ఎన్టీఆర్ కు మంచి ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక రీసెంట్ గా జూనియర్ ఎన్టీఆర్ కు ప్రముఖ బిగ్ ప్రొడక్షన్ సంస్థ టీ సీరీస్ కూడా ఒక ఆఫర్ చేసినట్లు సమాచారం. అసలైతే ముందు నుంచే ఈ సంస్థ ఆర్ఆర్ఆర్ హీరోలపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
టీ సీరీస్ కు ఎన్టీఆర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒక ప్రముఖ బాలీవుడ్ దర్శకుడితో కూడా చర్చలు జరువుతున్నట్లు సమాచారం. ఆ మధ్య సంజయ్ లీలా భన్సాలీ అని మరో పేరు కూడా వచ్చింది. కానీ ఇంకా ఫైనల్ అయితే కాలేదు. ఇక రెమ్యునరేషన్ అయితే ఆర్ఆర్ఆర్ సినిమాకు ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తున్నట్లు సమాచారం. ఆర్ఆర్ఆర్ కు దాదాపు 45కోట్ల వరకు తీసుకున్న తారక్ ఇప్పుడు 60కోట్ల వరకు డిమాండ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.