Balakrishna: బాలయ్య బాబుని విడిచి వెళ్లలేక కన్నీళ్లు పెట్టుకున్న చిన్నారి.. వీడియో వైరల్!

Balakrishna: టాలీవుడ్ హీరో బాలకృష్ణ తో కలిసి పని చేసిన ఎవరైనా సరే బాలయ్య బాబు గురించి చాలా గొప్పగా చెబుతూ ఉంటారు. బాలయ్య బాబు బయటకి కఠినంగా కోపంగా కనిపిస్తారు కానీ ఆయన మనసు వెన్న, బాలయ్య బాబు చాలా మంచి వారు అంటూ పొగడ్తలు కురిపిస్తూ ఉంటారు. చాలా సందర్భాలలో బాలయ్య బాబు అభిమానుల మీద చేయి చేసుకోవడంతో ఆ విషయాన్ని హైలెట్ చేస్తూ చాలా వరకు నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. కానీ బాలయ్య బాబుతో దెబ్బలు తిన్న వారు మాత్రం ఆ విషయాన్ని చాలా పాజిటివ్గా తీసుకుంటూ ఉంటారు.

బాలయ్య బాబుది చిన్నపిల్లల మనస్తత్వం అని, ఆయన అందరితో ఈజీగా కలిసిపోవడంతో ఎప్పుడు అందరిని నవ్విస్తూ ఉంటారని ఆయనతో కలిసి పని చేసిన చాలా మంది చెప్పారు. ఇది తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో కూడా అందుకు సాక్ష్యం అని చెప్పవచ్చు. ఇంతకీ ఆ వీడియో ఏంటి అందులో ఏముంది అన్న విషయానికి వస్తే.. దర్శకుడు బాబీ డైరెక్షన్ లో బాలయ్య బాబు హీరోగా నటించిన సినిమా డాకు మహారాజ్. ఈ సినిమాను జనవరి 12న గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ మరోసారి రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్ సినిమా పై అంచనాలను భారీగా పెంచేశాయి. డాకూ మహారాజ్ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారు.

 

ప్రగ్యాజైశ్వాల్, ఊర్వశి రౌతేలా, శ్రద్దా శ్రీనాథ్ బాలయ్య సరసన నటించనున్నారు. డాకూ మహారాజ్ సినిమాలో యాక్షన్ తో పాటు ఎమోషనల్ సీన్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయనని తెలుస్తుంది. ట్రైలర్ లో బాలయ్య ఓ చిన్నారితో ఆడిపాడటం చూపించారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా కు సంబందించిన ఒక వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. డాకు మహారాజ్ సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ పేరు వేదా అగర్వాల్. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత బాలకృష్ణను విడిచి వెళ్లలేక ఆ చిన్నారి కన్నీళ్లు పెట్టుకుంది. దాంతో బాలయ్య ఆ పాపను దగ్గరకు తీసుకొని ఓదార్చారు. ఇందుకు సంబందించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. బాలకృష్ణ కోపధారి మనిషి అని కొందరు అనుకుంటున్నారు. కానీ బాలయ్య మనసు బంగారం అన్ స్టాపబుల్ లో బాలయ్య తనలో ఉన్న చిలిపితనాన్ని , తోటి నటీనటులతో ఆయన ఎలా ఉంటారో బయటపెట్టింది. తాజాగా ఇప్పుడు వైరల్ అవుతున్న ఆ వీడియో చూసి కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు బాలకృష్ణ అభిమానులు.