Oka Pathakam Prakaram: ‘ఒక పథకం ప్రకారం’ ట్రైలర్ విడుదల చేసిన సాయిరాం శంకర్

‘143’, ‘బంపర్ ఆఫర్’ లాంటి చిత్రాలతో ప్రామిసింగ్ హీరో అనిపించుకున్న సాయిరాం శంకర్ మరో విభిన్న చిత్రం ‘ఒక పథకం ప్రకారం’ . ఈ సినిమా ట్రైలర్ ని ఈ రోజు విడుదల చేశారు. “ఓ మంచివాడి లోపల ఒక చెడ్డవాడు ఉంటాడు, ఓ చెడ్డవాడి లోపల చెడ్డవాడు మాత్రమే ఉంటాడు” అనే వాయిస్ ఓవర్ తో మొదలవుతూ క్రైం, మర్డర్ కథనాలను చూపిస్తూ హీరోనే విలనా అనే సందేహంపై ముగించడం ఆసక్తికరంగా ఉంది. దర్శకుడు వినోద్ కుమార్ విజయన్ ఈ చిత్రాన్ని తన వినోద్ విహాన్ ఫిల్మ్స్ బ్యానర్ తో పాటు గార్లపాటి రమేష్ విహారి సినిమా హౌస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై సంయుక్తంగా నిర్మించారు.

ఈ సందర్భంగా దర్శకనిర్మాత వినోద్ కుమార్ విజయన్ మాట్లాడుతూ, “ఇదొక విభిన్నమైన కథ. అడ్వకేట్ పాత్రలో సాయిరాం శంకర్, పోలీసు పాత్రలో సముద్రఖని నటన పోటాపోటీగా ఉంటుంది. ఊహించని మలుపులతో ఉత్కఠభరితంగా తీసుకెళ్ళే క్రైం, మిస్టరీ కథనాలతో ఆద్యంతం కట్టిపడేస్తుంది. రాహుల్ రాజ్, గోపి సుందర్ పాటలు – స్కోర్ అద్భుతంగా వచ్చాయి. చిత్రానికి సంబంధించిన అన్ని పనులు పూర్తి చేసుకుని ఫిబ్రవరి 7న గ్రాండ్ రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నాం” అన్నారు.

నటీనటులు: సాయిరాం శంకర్, శ్రుతి సోధి, ఆశిమ నర్వాల్, సముద్రఖని, రవి, పచముతు, భాను శ్రీ, గార్లపాటి కల్పలత, పల్లవి గౌడ

సాంకేతిక నిపుణులు: డి. ఓ. పి – రాజీవ్ రవి సంగీతం – రాహుల్ రాజ్ ఆర్. ఆర్ – గోపి సుందర్ ఎడిటర్ – కార్తీక్ జోగేశ్ సాహిత్యం – రహ్మాన్ గాయకుడు – సిద్ శ్రీరామ్ ఆర్ట్ డైరెక్టర్ – సంతోష్ రామన్ పి. ఆర్. ఓ – పులగం చిన్నారాయణ బ్యానర్ – వినోద్ విహాన్ ఫిల్మ్స్, విహారి సినిమా హౌస్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మాతలు – వినోద్ కుమార్ విజయన్, గార్లపాటి రమేష్ కథ, మాటలు, దర్శకత్వం – వినోద్ కుమార్ విజయన్

Game Changer Movie Genuine Public Talk || Game Changer Review || Ram Charan || Telugu Rajyam