Rashmika Mandanna: రష్మికకు గాయాలు.. షూటింగులకు బ్రేక్.. ఆందోళన చెందుతున్న ఫ్యాన్స్!

Rashmika Mandanna: టాలీవుడ్ హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రష్మిక ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. భాషతో సంబంధం లేకుండా వరుసగా సినిమా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది.. అందులో భాగంగానే ఇటీవలే అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాతో రష్మిక క్రేజ్ డిమాండ్ మరింత పెరిగింది. అంతేకాకుండా ఈ ముద్దుగుమ్మకు వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రష్మిక మందన ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూనే తదుపరి సినిమాలపై ఫోకస్ పెట్టింది. ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో రష్మికకు సంబంధించిన ఒక వార్త వైరల్ గా మారింది.. అదేమిటంటే ర‌ష్మిక మంద‌న్న గాయ‌ప‌డిన‌ట్లు తెలుస్తోంది. ఆమె జిమ్‌ లో వ్యాయామం చేస్తుండ‌గా ఆమె కాలికి గాయ‌మైనట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ర‌ష్మిక‌కు గాయం కావ‌డంతో ఆమె న‌టిస్తున్న చిత్రాల షూటింగ్ ఆగిపోయాయి. ఆమె త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్ర‌స్తుతం ఆమె బాగానే కోలుకుంటున్నార‌ని స‌న్నిహిత వ‌ర్గాలు వెల్లడించాయి. ఇటీవ‌ల జిమ్ చేస్తున్న స‌మ‌యంలో దుర‌దృష్ట‌వ‌శాత్తు ర‌ష్మిక గాయ‌ప‌డిందట. ఆమె విశ్రాంతి తీసుకుంటూ కోలుకుంటుందట.

గాయం కావ‌డం వ‌ల్ల ఆమె న‌టిస్తున్న సినిమా షూటింగ్‌ ల‌కు బ్రేక్ ప‌డింది. గాయం చిన్న‌దే అయినాఒక వారం పాటు విశ్రాంతి తీసుకోవాల‌ని వైద్యులు సూచించారట. ప్ర‌స్తుతం ఆమె వేగంగా కోలుకుంటోంది త్వ‌ర‌లోనే ఆమె షూటింగ్‌ల‌కు వెళ్ల‌నుంది. అని ర‌ష్మిక స‌న్నిహిత వ‌ర్గాలు తెలిపాయి. దీంతో అసలు రష్మికకు ఏమయింది ఇప్పుడు ఎలా ఉంది అంటూ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ వార్తలపై రష్మిక ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.