Bobby: బాలకృష్ణ హీరోగా బాబీ డైరెక్షన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం డాకు మహారాజ్. ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 12వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా బాలకృష్ణ హోస్టుగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమానికి డైరెక్టర్ ప్రొడ్యూసర్ మ్యూజిక్ డైరెక్టర్ ముగ్గురు కూడా హాజరయ్యారు.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా డైరెక్టర్ బాబి ఇదివరకు దర్శకత్వం వహించిన సినిమాల హీరోల ఫోటోలను బాలయ్య అక్కడ చూయించి వారి గురించి ప్రశ్నలు వేస్తూ సమాధానాలు రాబట్టారు అయితే బాబీ డైరెక్షన్ లో ఎన్టీఆర్ కూడా జై లవకుశ అనే సినిమా చేశారు కానీ ఎన్టీఆర్ ఫోటోని ఉద్దేశపూర్వకంగానే బాలకృష్ణ చూపించలేదు అంటూ ఎన్టీఆర్ అభిమానులు బాలయ్య తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ఇక తాజాగా ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మీడియా సమావేశంలో పాల్గొన్న డైరెక్టర్ బాబీకి రిపోర్టర్ నుంచి ఇదే ప్రశ్న ఎదురైంది.అన్‌స్టాపబుల్ షోలో ఎన్టీఆర్ ఫొటో చూపించి ఎడిటింగ్ లో తీసేసారా, మిమ్మల్ని ఎన్టీఆర్ గురించి అస్సలు మాట్లాడొద్దు అని చెప్పినట్టు వార్తలు వచ్చాయి అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించారు ఈ ప్రశ్నకు బాబి సమాధానం చెబుతూ ఈ వివాదానికి చెక్ పెట్టారు.
ఈ ప్రశ్నకు బాబి సమాధానం చెబుతూ… అక్కడ అంత పెద్ద డ్రామా జరగలేదు. దీనిని కవర్ చేసుకోవాల్సిన అవసరం కూడా తమకు లేదని తెలిపారు.అక్కడ చూపించిన ఫోటోల గురించి మాత్రమే అడిగారు బాలయ్య. నేను వాటికే సమాధానం చెప్పాను అంతే. షూటింగ్ గ్యాప్ లో ఒక క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ… ఈ పాత్రలో మా తారక్ అయితే బాగుంటుంది అంటూ బాలకృష్ణ చెప్పారు కాకపోతే అది రికార్డు అవ్వలేదు కాబట్టి బయటకు రాలేదని తెలిపారు.
ఇక బాలకృష్ణ గారికి జై లవకుశ సినిమా ఎంతో బాగా నచ్చిందని చాలాసార్లు ఆ సినిమాని చూసినట్టు కూడా తనతో చెప్పినట్టు బాబి వెల్లడించారు. ఇలా ఎన్టీఆర్ బాలకృష్ణ ఇష్యూ గురించి ఈ సందర్భంగా బాబి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవ్వడమే కాకుండా ఈ వివాదానికి చెక్ పడిందని కూడా అభిమానులు భావిస్తున్నారు.