Fun Bucket Bhargav: తెలుగు ప్రేక్షకులకు అలాగే సోషల్ మీడియా యూజర్స్ కి ఫన్ బకెట్ భార్గవ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టిక్ టాక్ రీల్స్, ఇంస్టాగ్రామ్ రీల్స్ చేస్తూ ప్రేక్షకులకు బాగా చేరువయ్యాడు. అంతేకాకుండా మిలియన్ల కొద్ది ఫాలోవర్లను కూడా సంపాదించుకున్నాడు. ఎంతోమందికి ఆదర్శంగా నిలవడంతో పాటు లైఫ్ ని కూడా ఇచ్చాడు. అంతవరకు బాగానే ఉన్నా ఆ తర్వాత భార్గవ్ బుద్ధి గడ్డి తినింది. యూట్యూబ్ లో కామెడీ చేస్తూ కామెడీ స్కిట్స్ చేస్తున్న క్రమంలోనే పలువురు అమ్మాయిలతో భార్గవ్ కూడా పరిచయం ఏర్పడింది. వారిలో చాలామంది అమ్మాయిలకు భార్గవ్ పుణ్యమా అని గుర్తింపు దక్కింది. అయితే వారిలో ఒక 14 ఏళ్ల అమ్మాయి కూడా ఉంది.
యూట్యూబ్ వీడియోలు చేసే ఆ 14 ఏళ్ల బాలికను భార్గవ్ చెల్లి చెల్లి అని పిలుస్తూనే లోబడుచుకున్నాడు. అంతటితో ఆగకుండా ఆమెపై అత్యాచారానికి పాల్పడడంతో ఆమె గర్భం దాల్చింది. దాంతో 2021 ఏప్రిల్ 16న బాలిక తల్లి పెందుర్తి పోలీసులను ఆశ్రయించారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన పోలీసులు భార్గవ్‌ను దిశ, ఫోక్సో చట్టం. కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అతడితో పని చేసిన అమ్మాయిల వల్లే భార్గవ్ కు పేరొచ్చినప్పటికీ వారిని కొంచెం కూడా గౌరవించడని, అతనో వుమెనైజర్ అంటూ కొందరు అమ్మాయిలు పేర్కొన్నారు. అయితే ఈ కేసులో అరెస్టు అయిన భార్గవ్ కొద్ది రోజుల తర్వాత మళ్లీ బెయిల్ పై బయటకు వచ్చిన విషయం తెలిసిందే.
ఈ విషయం కాస్త రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారడంతో భార్గవ్ పై విమర్శలు కూడా వచ్చాయి. చాలామంది అతనిపై మండిపడ్డారు. దారుణంగా ట్రోలింగ్స్ కూడా చేశారు. అయితే తాజాగా ఫన్ బకెట్ భార్గవ్ కి కోర్టు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో ఫన్ బకెట్ భార్గవ్‌కి 20 ఏళ్ళు జైలు శిక్ష పడింది. దీనిపై నేడు విచారణ జరిపిన విశాఖ జిల్లా పోక్సో కోర్టు భార్గవ్‌కి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు బాధిత బాలికకు రూ.4 లక్షల పరిహారం ఇవ్వాలంటూ తీర్పును వెల్లడించింది. అయితే ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొందరు భార్గవ్ కి మద్దతుగా కామెంట్స్ చేస్తుండగా ఇంకొందరు ఇలాంటి పనులు చేసే వారికి ఇలాగే చేయాలి. మరొకరు ఇలాంటి తప్పు చేయాలంటే భయపడాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.