Kangana Ranaut: ఆస్కార్ సినిమాల జాబితాపై సంచలన వ్యాఖ్యలు చేసిన కంగనా రనౌత్?

Kangana Ranaut: బాలీవుడ్ బ్యూటీ నటి ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె సినిమాల ద్వారా కంటే ఎక్కువగా కాంట్రవర్సీ విషయాల ద్వారానే పాపులర్ అయిన విషయం తెలిసిందే. తరచూ ఏదో ఒక కాంట్రవర్సీతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. సోషల్ మీడియా జరిగే అంశాలతో పాటు, బాలీవుడ్ ఫై తరచూ షాకింగ్ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఇకపోతే కంగనా రనౌత్ త్వరలో ఎమర్జన్సీ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. అయితే గతంలోనే విడుదల కావాల్సిన ఈ సినిమా పలుసార్లు వాయిదా పడుతూ వస్తోంది. చాలా రోజుల తర్వాత ఎట్టకేలకు ఈ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది.

ఈ నెల 17న థియేటర్లలో విడుదల కానుంది. ఇటీవలే ఈ మూవీ ట్రైలర్‌ ను కూడా విడుదల చేశారు మూవీ మేకర్స్. అయితే తాజాగా కంగనా రనౌత్ చేసిన కామెంట్స్ చేసిన నెట్టింట వైరల్‌ గా మారాయి. ఇటీవల ఆస్కార్‌ ఎంపికైన చిత్రాల జాబితా పై హాట్ కామెంట్స్ చేసింది. తాజాగా ఒక ఇంటర్వ్యూకు హాజరైన ఆమె ఆస్కార్ సినిమాల జాబితా పై కాస్తా ఘాటు వ్యాఖ్యలు చేసింది. మన దేశాన్ని వ్యతిరేకంగా తీసిన సినిమాలకే స్థానం దక్కిందని కంగనా ఆరోపించింది. అలాంటి వాటికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పింది. ప్రస్తుతం ఎమర్జన్సీ మూవీ ప్రమోషన్స్‌ తో బిజీగా ఉన్న కంగనా ఇలాంటి వ్యాఖ్యలు చేసింది.

ప్రతి ఏడాది ఇదే తంతు జరుగుతోందని మండిపడింది. ఈ సందర్భంగా కంగనా మాట్లాడుతూ.. మన దేశానికి వ్యతి రేకంగా చిత్రీకరించే సినిమాలు తరచుగా ఆస్కార్‌ నామినేషన్స్‌ కు ఎంపిక చేస్తున్నారు. సాధారణంగా మనదేశం కోసం వారు ముందుకు తెచ్చే ఎజెండా చాలా భిన్నంగా ఉంటుంది. ఆస్కార్‌ ఎంపికైన చిత్రాలు భారతదేశానికి వ్యతిరేకం. ఇప్పుడు ఆ చిత్రాలకే ప్రశంసలు వస్తున్నాయి. మన దేశంలో ఆస్కార్ అవార్డుల కోసం స్లమ్‌డాగ్ మిల్లియనీర్‌ లాంటి సినిమా అయి ఉండాలి. అంటే మనదేశాన్ని తక్కువగా చూపించే సినిమాలకే నామిషన్స్‌లో చోటు ఉంటుంది అని అన్నారు. అనంతరం ఎమర్జెన్సీ సినిమా గురించి మాట్లాడుతూ.. ఎమర్జెన్సీ అలాంటి చిత్రం కాదు. ఈ రోజు భారతదేశం ఎలా ఉందో చూడటానికి పాశ్చాత్య దేశాలు సిద్ధంగా ఉన్నాయి. నేను ఈ అవార్డుల గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు. నేను భారతీయ అవార్డులు, విదేశీ అవార్డుల గురించి పట్టించుకోను. ఇది అద్భుతంగా రూపొందించిన చిత్రం. అంతర్జాతీయ చలన చిత్రం కంటే బాగుటుంది. అదే సమయంలో మన రాజకీయాలు ఎలా పనిచేస్తాయో నాకు తెలుసు. ఒక జాతీయవాదిగా నాకు అవార్డు ఫంక్షన్లపై మాకు పెద్దగా ఆశ లేదు అని కంగనా చెప్పుకొచ్చింది.