సహస్ర ఎంటటైన్మెంట్స్ ప్రొడక్షన్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెంబర్ 1 గా తెరకెక్కిన హైడ్ న్ సీక్ సినిమా ఇటీవల థియేటర్స్ లో విడుదలై మంచి రివ్యూస్ తో పాజిటీవ్ టాక్ తో ప్రేక్షకాదరణ పొందింది. విశ్వంత్ హీరోగా, శిల్పా మంజునాథ్, రియా సచ్ దేవ ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన ఈ సినిమా ద్వారా బసి రెడ్డి రానా దర్శకుడిగా పరిచయం అయ్యారు. నరేంద్ర బుచ్చి రెడ్డిగారి నిర్మించిన ఈ సినిమా ప్రస్తుతం ఆహా ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతొంది.
సాక్షి రంగారావు అబ్బాయి సాక్షి శివ, శ్రీధర్ రెడ్డి ముఖ్య పాత్రలు పోసించిన ఈ మూవీ సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ గా దర్శకుడు బసిరెడ్డి రానా తెరకెక్కించారు, ఎక్కడా రాజీ పడకుండా నిర్మాత నరేంద్ర బుచ్చి రెడ్డిగారి ఈ మూవీని నిర్మించారు.
ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్స్ కు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. మొదటి సీన్ నుంచి సినిమా అయిపోయే వరకు ప్రేక్షకుడిని సీటులోంచి కదలనీయకుండా చేయడంలో దర్శకుడు మంచి సస్పెన్స్ మెయింటెన్ చేసాడు. ఆ మధ్య బ్లూవేల్ గేమ్ అని బాగా ట్రెండ్ అయింది. అలాంటి ఒక గేమ్ పిల్లలనే కాదు యువకులను కూడా ఎలా బానిసలుగా చేసి వారి లైఫ్ లతో ఎలా ఆడుకుంటుందో కళ్లకు కట్టినట్లు చూపించారు. మొదటి మర్డర్ నుంచి విరామం వరకు స్క్రీన్ ప్లే ఎంతో గ్రిప్పింగ్ రాసుకున్నారు.
తరువాత ఏం జరగబోతుందో ఎవరి ఊహలకు అందనంతగా చక్కగా తెరపై ప్రెజెంట్ చేశాడు దర్శకుడు. వరుస మర్డర్లు ఎందుకు జరగుతున్నాయి. దాని వెనకాల ఉన్న మోటివ్ ఏమిటన్నది ఈ సినిమాలో అసలు ట్విస్ట్. కథలో భాగంగా సినిమాలో క్యారెక్టర్స్ డిజైన్ చేయడం బాగుంది. పురాణాలలో ఒక కథకు లింక్ చేస్తూ చెప్పే విధానం ఆకట్టుకుంది. థియేటర్స్ లో మిస్ అయిన ప్రేక్షకులు హైడ్ న్ సీక్ సినిమాను ఆహా ఓటిటిలో చూడవచ్చు.
నటీనటులు: విశ్వంత్ హీరోగా, శిల్పా మంజునాథ్, రియా సచ్ దేవ, సాక్షి శివ, శ్రీధర్ రెడ్డి, సుమంత్ తదితరులు
బ్యానర్: సహస్ర ఎంటర్టైన్మెంట్స్
సమర్పణ: నిశాంత్ ప్రెజెంట్స్
దర్శకత్వం: బసిరెడ్డి రానా
నిర్మాత: నరేంద్ర బుచ్చి రెడ్డిగారి
సినిమాటోగ్రఫీ: చిన్న రామ్
మ్యూజిక్: లిజో కె జోష్
ఎడిటర్: అమర్ రెడ్డి కుడుముల
ఆర్ట్: నిఖిల్ హాసన్