Allu Arjun: టాలీవుడ్ ప్రముఖ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గురించి మనందరికీ తెలిసిందే. తెలుగులో ఎన్నో సినిమాలను నిర్మించి నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అల్లు అరవింద్. ఇకపోతే తాజాగా అల్లు అరవింద్ తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. అల్లు అరవిందు పుట్టినరోజు సందర్భంగా అల్లు ఫ్యామిలీ అలాగే మెగా ఫ్యామిలీ, అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. అందులో భాగంగానే హీరో అల్లు అర్జున్ కూడా తన తండ్రికి స్పెషల్ బర్త్డే విషెస్ ను తెలిపారు.. అంతే కాకుండా తన తండ్రి బర్త్డే వేడుకలను దగ్గరుండి మరి ఆనందంగా జరిపించారు. తండ్రితో స్వయంగా కేక్ కట్ చేయించారు.
ఈ వేడుకలో బన్నీ భార్య స్నేహరెడ్డి, పిల్లలు అయాన్, అర్హ కూడా పాల్గొన్నారు. అల్లు అరవింద్ కేక్ కట్ చేసిన ఫోటోను ట్విటర్ ద్వారా పంచుకున్నారు బన్నీ. ఫోటోలను షేర్ చేస్తూ ఈ విధంగా రాసుకొచ్చారు. పోస్ట్‌లో పుష్ప కా బాప్ అని రాసిన ఉన్న కేక్ ఫోటోను కూడా షేర్ చేశారు. ఈ కేక్ ఐకాన్ స్టార్ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. ఈ విషయం తెలుసుకున్న బన్నీ ఫ్యాన్స్ అల్లు అరవింద్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇకపోతే ఐకాన్ స్టార్ విషయానికి వస్తే.. అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్పా 2 మూవీ ఇటీవలే విడుదల అయిన విషయం తెలిసిందే.
Happy Birthday Dad . Thank you for making our lives soo special with your gracious presence . pic.twitter.com/CgWYsbk2eF
— Allu Arjun (@alluarjun) January 10, 2025
సుకుమార్- అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ఈ సినిమా భారతీయ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టించింది. ఇప్పటికే బాహుబలి, కేజీఎఫ్, బాహుబలి-2 రికార్డులను తిరగరాసింది. ప్రస్తుతం రూ.1800 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలోనే అమిర్ ఖాన్ చిత్రం దంగల్ వసూళ్ల రికార్డ్‌పై పుష్పరాజ్ కన్నుపడింది. రూ.2 వేల కోట్లకు పైగా వసూళ్లతో తొలిస్థానంలో దంగల్ కొనసాగుతోంది. ఆ రికార్డ్‌ను బద్దలు కొట్టేందుకు పుష్ప మేకర్స్ సరికొత్త ప్లాన్‌తో ఆడియన్స్ ముందుకొచ్చారు. ఈనెల 17 నుంచి దాదాపు 20 నిమిషాల పాటు అదనంగా సీన్స్ జోడించనున్నట్లు ప్రకటించారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు.