Director Shankar: గేమ్ చేంజర్ తో ఫామ్ లోకి వచ్చిన శంకర్.. నెక్స్ట్ తెరకెక్కబోయే ప్రాజెక్ట్స్ ఇవే!

Director Shankar: తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ గురించి మనందరికీ తెలిసిందే. శంకర్ ప్రస్తుతం వరస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవల ఇండియన్ 2 సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న శంకర్ తర్వాత రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ మూవీకి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. తాజాగా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమా విడుదల అయ్యి పాజిటివ్ టాక్ రావడంతో శంకర్ మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు. ఇండియన్ 2 సినిమా తర్వాత విమర్శించిన వాళ్లే ఇప్పుడు ఆయనని ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు.

ఈ మధ్య ఎక్కువగా విఎఫ్ఎక్స్ సినిమాలు చేసిన శంకర్.. చాలా ఏళ్ళ తర్వాత పొలిటికల్ సినిమా చేసారు. ప్రస్తుతం ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇకపోతే ఈ సినిమా విడుదల ఈ మంచి సక్సెస్ సాధించడంతో శంకర్ తదుపరి సినిమాల జాబితాఫై అందరి కన్ను పడింది. నెక్స్ట్ శంకర్ తెరకెక్కించబోయే సినిమాలు ఏవి అన్న విషయంపై సోషల్ మీడియాలో చర్చలు కూడా మొదలయ్యాయి. కాగా గేమ్ ఛేంజర్ తర్వాత ఇండియన్ 3 కూడా లైన్‌ లోనే ఉంది. గేమ్ ఛేంజర్ హిట్టైతే ఇండియన్ 3 సినిమాకి మళ్లీ ఊపొస్తుంది. అదే జరగాలని కోరుకుంటున్నారు శంకర్. ఇండియన్ 2 డిజాస్టర్ కావడంతో పార్ట్ 3పై ఎవరికీ పెద్దగా అంచనాల్లేవు. దీని తర్వాత ప్రాజెక్ట్‌కు ఇప్పట్నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు శంకర్.

వీరయుగ నాయగన్ వేల్పరి అనే పుస్తకం ఆధారంగా 3 భాగాలతో శంకర్ ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారట. అయితే నిజానికి వీరయుగ నాయగన్ వేల్పరి అనేది శంకర్ డ్రీమ్ ప్రాజెక్ట్. ఈ సినిమాను శంకర్ కూడా కన్ఫర్మ్ చేసారు. గేమ్ ఛేంజర్ స్క్రిప్ట్‌ లో సహాయం చేసిన మధురై ఎంపి వెంకటేశన్ రాసిన నవలలో వేల్పరి నేపథ్యం ఉంది. దీన్ని కూడా తన సినిమా కోసం వాడుకోబోతున్నారట శంకర్. గేమ్ ఛేంజర్, ఇండియన్ 3 ఆడితే శంకర్ నుంచి ఈ 3 పార్ట్స్ సినిమా ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు. వేల్పరి ప్రాజెక్ట్‌ ను ఇండియన్ సినిమాలో ఉన్న సూపర్ స్టార్స్‌తో ప్లాన్ చేస్తున్నాడు. మరి గేమ్ చేంజర్ సినిమా ఇంకా ముందు ముందు ఎలాంటి ఫలితాలను రాబడుతుందో చూడాలి మరి. ఈ సినిమా మంచి ఫలితాలను రాబడితే పైన చెప్పిన విధంగా ఆ సినిమాలన్నీ కూడా శంకర్ నుంచి ఎక్స్పెక్ట్ చేయవచ్చు.