Daaku Maharaaj: డాకు మహారాజ్ రెండో ట్రైలర్ రిలీజ్.. పూనకాలు తెప్పిస్తున్న వీడియో.. మాములుగా లేదుగా!

Daaku Maharaj: టాలీవుడ్ హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం డాకు మహారాజ్. బాబీ ఈ సినిమాకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఇందులో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 12న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్లు సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. ఈ సినిమా కూడా తప్పకుండా సక్సెస్ అవుతుందని బాలయ్య బాబు అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాతో మరో హిట్ గ్యారెంటీ అంటున్నారు మూవీ మేకర్స్.

ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ఈ మూవీపై అంచనాలను మరింత పెంచింది. ఇక విడుదల తేదీకి మరికొద్ది రోజులే సమయం ఉండడంతో మూవీ మేకర్స్ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలను మరింత వేగవంతం చేశారు. అయితే మొదటి ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచడంతో రెండవ ట్రైలర్ కోసం ఎదురు చూస్తుండగా ఎట్టకేలకు తాజాగా ఈ సినిమా రెండవ ట్రైలర్ ని కూడా విడుదల చేశారు. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ బాగా ఆకట్టుకుంటోంది.

Daaku Maharaaj Release Trailer | NBK, Pragya, Shraddha, Bobby Deol | Thaman S | Bobby Kolli

ఎప్పటిలాగే బాలయ్య బాబు ఈ సినిమాలో కూడా డైలాగ్స్ ని అదరగొట్టారు. బాల‌య్య డైలాగులు ఈల‌లు వేయించేలా ఉన్నాయి. యాక్ష‌న్ సీన్స్ అయితే నెక్ట్స్ లెవ‌ల్ అని చెప్పాలి. ఇప్ప‌టికే ఈ సినిమా పై భారీ అంచ‌నాలే ఉండ‌గా తాజా ట్రైల‌ర్‌తో అవి అమాంతం పెరిగిపోయాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో మామూలుగా లేదుగా అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు బాలయ్య బాబు అభిమానులు. ఇప్పటికే గత మూడు సినిమాలతో హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్న బాలయ్య బాబు ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటారా అని అభిమానులు ఎంతో అద్భుతంగా ఎదురుచూస్తున్నారు. చూసిన అభిమానులు హిట్టు కొట్టడం గ్యారెంటీ అంటూ కామెంట్ల కోసం కురిపిస్తున్నారు..