ఇంట్లోని పూజగదిలో ఈ వస్తువులను ఉంచితే అరిష్టం.. పండితులు ఏం చెప్పారంటే?

Mandir-for-home-Your-guide-to-set-up-a-pooja-room

దేశంలోని హిందువులలో చాలామంది దేవుడిని పూజించడానికి ఎంతగానో ఇష్టపడతారు. పూజగదిని శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు పూజ చేసే సమయంలో కొన్ని నియమాలను పాటిస్తారు. అయితే కొంతమంది ఎన్ని పూజలు, వ్రతాలు చేసినా ఆశించిన ఫలితం దక్కక ఇబ్బందులు పడుతుంటారు. పూజ సమయంలో కొన్ని తప్పులు అస్సలు చేయకూడదు. కొన్ని తప్పులు చేయడం వల్ల చెడు ఫలితాలు కలిగే ఛాన్స్ ఉంటుంది.

 

కొంతమంది ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ సంఖ్యలో దేవుని విగ్రహాలను ఉంచడం జరుగుతుంది. అయితే విగ్రహాలను ఎక్కువగా ఉంచడం వల్ల మంచి ఫలితాలు కలిగే అవకాశాలు తగ్గుతాయి. ఇంట్లో దేవుని పటాల సంఖ్య ఎల్లప్పుడూ బేసి సంఖ్యలో ఉండాలి తప్ప సరి సంఖ్యలో ఉండకూడదు. మనం ఇంట్లో ఉంచే శివలింగం ఎప్పుడూ బహిరంగ ప్రదేశంలో ఉంటే మంచిదని చెప్పవచ్చు.

 

మన ఇంట్లో ఉండే శివలింగం ఎప్పుడూ బొటన వేలి పరిమాణంతో పోల్చి చూస్తే చిన్నదిగా ఉంటే మంచిది. పూజ గదిలో అక్షింతల కోసం ఎప్పుడూ మంచి బియ్యాన్ని మాత్రమే ఉపయోగిస్తే మంచిదని చెప్పవచ్చు. అక్షింతల కోసం విరిగిన బియ్యాన్ని ఉపయోగిస్తే మాత్రం చెడు ఫలితాలు కలిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. పూజ గదిలో అక్షింతలను వాడితే పూలు వాడకపోయినా మంచి ఫలితాలు దక్కుతాయి.

 

పూజ గదిలో విరిగిన దేవుని పటాలను, చిరిగిన దేవుని పటాలను అస్సలు ఉపయోగించకూడదు. అలాంటి పటాలను ఉపయోగించడం వల్ల వాస్తు దోషాల వల్ల ఇబ్బంది పడే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాంటి చిత్రపటాలను ఇంటినుంచి తొలగించుకుంటే శుభ ఫలితాలను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఇంట్లో ఒకటి కంటే ఎక్కువగా శివలింగాలను ఉంచడం కూడా మంచిది కాదు.