ఈ మధ్య కాలంలో చాలామంది యూరిన్ సంబంధిత సమస్యలతో బాధ పడుతున్నారు. శరీరంలో నీటి కొరత వల్ల చాలా సందర్భాల్లో ఈ సమస్య వేధించే అవకాశాలు అయితే ఉంటాయి. మూత్ర వ్యవస్థలోని ఏదైనా భాగంలో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ సంభవించే ఛాన్స్ ఉంటుంది. ఈ వ్యాధి బారిన పడితే శరీరం నుంచి తక్కువ మూత్రం రావడంతో పాటు శరీరంలో యూరిన్ ఇన్ఫెక్షన్ కు కారణమయ్యే బ్యాక్టీరియా పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి.
ఈ సమస్య విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కొన్ని సందర్భాల్లో కిడ్నీ ఫెయిల్యూర్ బారిన పడే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. పురుషులతో పోల్చి చూస్తే స్త్రీలలో ఈ సమస్య ఉంటుంది. తరచూ మూత్రం వస్తున్నా మూత్రంలో మంటగా అనిపిస్తున్నా వెంటనే వైద్యులను సంప్రదిస్తే మంచిది. మూత్రంలో స్మెల్ వస్తున్నా పొత్తి కడుపులో తరచూ నొప్పు వస్తున్నా యూరిన్ ఇన్ఫెక్షన్ బారిన పడినట్టే అని గుర్తుంచుకోవాలి.
ఈ సమస్య బారిన పడిన వాళ్లు మందులు వాడుతూనే తగిన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి. తరచూ నీరు త్రాగుతూ ఉండటంతో పాటు తినే ఆహారంలో నారింజ, పెరుగు, బచ్చలికూరను చేర్చుకుంటే మంచిది. పబ్లిక్ టాయిలెట్లను వీలైనంత వరకు వినియోగించడానికి దూరంగా ఉండాలి. విటమిన్ సి, క్రాన్ బెర్రీస్ తీసుకోవడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టే అవకాశాలు అయితే ఉంటాయి.
యూరిన్ ఇన్ఫెక్షన్ సమస్య మరింత తీవ్రంగా ఉంటే యూరాలజిస్ట్ లను సంప్రదించడం ద్వారా సమస్యను పరిష్కరించుకునే అవకాశం అయితే ఉంటుంది. చిన్నచిన్న సమస్యలు అని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆ సమస్య పెద్దదై కొత్త ఇబ్బందులకు కారణమయ్యే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.