స్పామ్ కాల్స్ తో విసిగిపోతున్నారా… ఇలా చేస్తే ఇక పై ఈ తలనొప్పి అస్సలు ఉండదు?

ఈ మధ్యకాలంలో పర్సనల్ లోన్ వచ్చింది పలానా బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాము అంటూ ఎక్కువగా స్పామ్ కాల్స్ ద్వారా ఎంతో మంది ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు.ఇలా మనం ఏదైనా బిజీగా పనులు చేసుకుంటున్న నేపథ్యంలో ఎలాంటి ఫోన్ కాల్స్ కొన్నిసార్లు చాలా విసుగు తెప్పిస్తుంటాయి. అయితే ఇలాంటి ఫోన్ కాల్స్ రాకుండా ఉండాలంటే ఈ పద్ధతులు పాటించడం వల్ల ఇకపై స్పామ్ కాల్ తలనొప్పి అస్సలు ఉండదు.

 

ఇటు వంటి ఫోన్ కాల్స్ ఆపడానికి కుదరకపోకపోవడం వల్ల ఇబ్బందులు తప్పడం లేదు. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) గత కొన్ని సంవత్సరాలుగా అనేక చర్యలు తీసుకున్నప్పటికీ, ఇబ్బందికరమైన టెలిమార్కెటింగ్ కాల్‌లు మరియు సందేశాల సమస్య అలాగే ఉంది. ఇలాంటి కాల్స్ ద్వారా పెద్ద ఎత్తున మోసానికి పాల్పడుతుంటారు అయితే ఇలాంటి ఫోన్ కాల్స్ రాకుండా ఉండాలంటే ఇలా చేయడం ద్వారా స్పామ్ కాల్స్ రాకుండా అరికట్టవచ్చు.

ముందుగా మీ ఫోన్ లో డిఫాల్ట్ మెసేజింగ్ యాప్‌ని తెరవాలి. కొత్త మెసేజ్ టైప్ చేయాలి.FULLY BLOCK అని కేపిటల్ లెటర్స్ లో టైప్ చేసి, టోల్ ఫ్రీ నంబర్ 1909కి పంపించాలి.

 

 

ఇది టెలీమార్కెటింగ్ కు సంబంధించిన స్పామ్ కాల్స్, మెసేజ్ రాకుండా చేస్తుంది. కొన్ని కోడ్లను వినియోగించి మిగిలిన స్పామ్ కాల్స్ కూడా రాకుండా చూసుకోవచ్చు. అందుకోసం..బ్యాంకింగ్, ఇన్యూరెన్స్, క్రెడిట్ కార్డు, ఆర్థికపరమైన ఉత్పత్తులకు సంబంధించిన ప్రోమోషనల్ మెసేజ్ లు కాల్స్ ను బ్లాక్ చేయడానికి BLOCK 1 అని టైప్ చేయాలి.రియల్ ఎస్టేట్ కు సంబంధించిన కాల్స్ రాకుండా ఉండాలంటే BLOCK 2 అని టైప్ చేయాలి.విద్యాపరమైన స్పామ్ కాల్స్ ను నిరోధించడానికి BLOCK 3, హెల్త్ విషయమైన కాల్స్ ని బ్లాక్ చేయడానికి BLOCK 4, ఆటోమొబైల్, ఐటీ, వినోదానికి సంబంధించిన ప్రోమోషల్ కాల్స్ నిరోధించడానికి BLOCK 5 అని టైప్ చేయాలి. ఇలా స్పామ్ కాల్స్ ను అరికట్టవచ్చు.