బ్లాక్ టీ అనేది ప్రపంచవ్యాప్తంగా ఇష్టంగా తాగే పానీయం అనే సంగతి తెలిసిందే. కామల సిన్సిస్ ఆకులను ఉపయోగించి బ్లాక్ టీ తయారు చేయడం జరుగుతుంది. బ్లాక్ టీ తయారీలో, టీ ఆకులను ఆక్సీకరణకు గురిచేసి, ఆపై వాటిని పొడి చేస్తారు, దీనివల్ల ఆకులకు నలుపు రంగు వస్తుంది. బ్లాక్ టీ సాధారణంగా బలంగా మరియు కొద్దిగా తీపిగా ఉంటుంది. బ్లాక్ టీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి శరీరానికి మేలు చేస్తాయి.
బ్లాక్ టీ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. బ్లాక్ టీ రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. బ్లాక్ టీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది మరియు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. బ్లాక్ టీలో కేలరీలు తక్కువగా ఉంటాయి. బ్లాక్ టీలో కెఫిన్ ఉంటుంది, కాబట్టి అధికంగా తాగడం మంచిది కాదు. బ్లాక్ టీని వేడి నీటిలో టీ బ్యాగ్ లేదా టీ ఆకులను వేసి తయారు చేస్తారు.
బ్లాక్ టీని పాలు, నిమ్మకాయ లేదా మసాలాలతో కూడా తాగవచ్చు. బ్లాక్ టీ తాగడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చు. అయితే పరగడుపున బ్లాక్ టీ తాగడం మాత్రం ఆరోగ్యానికి శ్రేయస్కరం కాదు. ఖాళీ కడుపుతో కాపీ తాగితే శరీరంలో యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయి. బ్లాక్ టీ అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలకు కారణమవుతుంది. గ్యాస్టిక్ సమస్యలు ఉన్నవాళ్లు బ్లాక్ టీకి వీలిఅనంత దూరంగా ఉంటే మంచిది.
బ్లాక్ టీ వణుకు, హృదయ స్పందనల రేటు తగ్గడం, తలనొప్పి లాంటి సమస్యలకు కారణమవుతుంది. బ్లాక్ టీ నిద్రపై కూడా కొంతమేర ప్రభావం చూపుతుంది. ఒత్తిడిని తగ్గించుకోవాలని భావించే వాళ్లు బ్లాక్ టీకి వీలైనంత దూరంగా ఉంటే ఆరోగ్యానికి మంచిదని చెప్పవచ్చు.