మనలో చాలామంది పిప్పిళ్ళ గురించి ఏదో ఒక సందర్భంలో వినే ఉంటారు. కొన్ని చోట్ల వీటిని పిప్పలి అని కూడా పిలుస్తారు. ఒక రకమైన ఔషధ మొక్క నుండి ఇవి తయారవుతాయి. ఆయుర్వేదంలో ఈ మొక్క భాగాలకు ఉండే ప్రాధాన్యత అంతాఇంతా కాదు. ఈ మొక్క ఆకులు నల్లగా ఉంటాయి. శ్వాస సంబంధిత సమస్యలతో బాధ పడేవాళ్ళకు ఇవి అద్భుతంగా మేలు చేస్తాయి. కఫము, శ్లేష్మము సమస్యలు సైతం వీటి ద్వారా దూరమవుతాయి.
ఇందులో ఉండే పైపెరిన్ అనే సమ్మేళనం దీనికి కారమైన రుచి ఇస్తుంది. ఐతే గర్భిణీ స్త్రీలు మాత్రం వీటికి దూరంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. గ్యాస్, ఉబ్బరం, మలబద్ధకం సమస్యలతో బాధ పడేవాళ్ళు దీనికి ప్రాధాన్యత ఇస్తే మేలు జరుగుతుంది. శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెంచడంతో పాటు ఇన్ఫెక్షన్లకు చెక్ పెట్టడానికి ఇది తోడ్పడుతుంది. దీని పొడిని తేనెతో కలిపి తీసుకోవచ్చు. పసుపు, అల్లంతో కలిపి దీనిని తీసుకుంటే మంచిది.
పిప్పలితో తయారు చేసిన క్యాప్సూల్స్ సైతం మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. వీటితో తయారు చేసిన కాషాయం తో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆహారంలో మసాలా దినుసులుగా దీనిని వినియోగించవచ్చు. తలనొప్పి, కీళ్లనొప్పి, కండరాల నొప్పిని తగ్గించడంలో ఇది ఎంతగానో సహాయపడుతుంది. బరువు తగ్గాలని భావించే వాళ్లకు ఇది ఎంతో మేలు చేస్తుంది.
పిప్పలిలో యాంటీఆక్సిడెంట్లు మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి, ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. పిప్పలి మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఒత్తిడి, ఆందోళన మరియు నిరాశను తగ్గించడంలో సహాయపడుతుంది. పిప్పలి నూనెను కూడా ఉపయోగించవచ్చు, ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది