గర్భం తో ఉన్న మహిళలు తప్పక పాటించాల్సిన నియమాలు ఇవే…?

Pregnant-women-are-have-a-normal-delivery-if-they-follow-these-precautions

వివాహాం తరువాత సంతానం కోసం ఒక శుభ ముహూర్తంలో భార్యా భర్తల కలయిక జరుగుతుంది. అయితే సంతానం కోసం శారీరక సుఖాన్ని కోరుకోకుడాదు. గర్భం దాల్చిన తర్వాత స్త్రీ కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి. ఇక గర్భంతో ఉన్న మహిళలు ఎటువంటి నియమాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం అదితి పూర్ణిమ వ్రతాన్ని పూర్తీ చేసిన తరువాత కశ్యపుడు ఆమెకు గర్భాదానం చేశాడు. ఇక గర్భంతో ఉన్న అదితి కి కొన్ని నియమాలు సూచించాడు.

గర్భంలో ఉన్న మహిళలు పాటించవలసిన నియమాలు :

• గర్భంలో ఉన్న మహిళలు ఎక్కువ సమయం నిద్రపోకుడడు.
• అలాగే బిగ్గరగా నవ్వకుడదు.
• అలాగే సంధ్యా సమయంలో గర్భిణీ స్త్రీలు భోజనం చేయకూడదు
• సున్యంగా అంటే చీకటిగా ఉన్న ప్రదేశంలో ఉండకూడదు.
• అలాగే బొగ్గు,బూడిద, అస్థికలు ఉన్న ప్రదేశంలోకి గర్భిణీ స్త్రీలు వెళ్ళకూడదు.
• అలాగే పుట్టలు ఉన్న ప్రదేశానికి కూడా వెళ్ళకూడదు.
• అలాగే తల స్నానం చేసిన తర్వాత గర్భిణీ స్త్రీలు వెంటనే జుట్టు అరబెట్టుకొని ముడి వేసుకోవాలి. పొరపాటున కూడా జుట్టు విరబోసుకుని ఉండకూడదు.
• అలాగే ఎక్కువ ఆలోచిస్తూ ఆందోళనగా ఉండకూడదు.
• అమంగళ కరమైన మాటలు మాట్లాడకుండా నిత్యం దైవ ఆరాధన చేస్తూ ఉండాలి.
• స్నానం చేసే సమయంలో ఆ నీటిలో అన్ని రకాల మూలికలు కలుపుకొని స్నానం చేయాలి.
• అలాగే గర్భంతో ఉన్న మహిళలు నీటిలోకి దిగకుడదు.
• నగ్నంగా ఉండటం, రెండుకాళ్ళ మద్య తలపెట్టుకోవటం, తాడికాళ్ళతో ఉండటం వంటి పనులు కూడా చేయకూడదు.

ఇలా కశ్యపుడు గర్భవతి అయిన తన భార్య అదితి కి ఈ నియమాలు సూచించాడు. అయితే ప్రస్తుత కాలంలో మహిళలు ఈ నియమాలను పాటించరు. కానీ ఈ నియమాలు పాటించడం వల్ల సత్ సంతానం కలుగుతుంది.